బెస్ట్ ఆఫ్ 2020: ఏది ఉత్తమ చిత్రమని మీరు భావిస్తున్నారు?
టాలీవుడ్‌లో ఏటా కొన్ని వందల సినిమాలు రూపొందుతాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. కొన్ని సినిమాలు బోల్తాకొడతాయి. ఇంకొన్ని చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్‌గా విజయం సాధించవు. ఇలాంటి చిత్రాలన్నీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడటంతో డైరెక్టుగా ఓటీటీలో కొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. మొత్తం మీద ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో 10 మంచి సినిమాలను మీ ముందు ఉంచుతున్నాం. వీటిలో ఉత్తమమైన చిత్రం ఏదని మీరు భావిస్తున్నారో కింది పోల్‌లో ఓటు వేసి చెప్పండి. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాల్లో ఉత్తమమైన వాటిని మేం ఎంపిక చేశాం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ ఏడాది భారీ విజయాలు అందుకున్న చిత్రాలు. ‘అల.. వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా భారీ వసూళ్లు సాధించింది. సంక్రాంతి సందర్భంగానే విడుదలైన ‘డిస్కో రాజా’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘భీష్మ’ హీరో నితిన్ కెరీర్‌లోనే పెద్ద విజయంగా నిలిచింది. సేంద్రియ వ్యవసాయం నేపథ్యంలో కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తరవాత ‘హిట్’, ‘’ మరో పెద్ద సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. దీనికి కారణం కరోనా వైరస్. ఆ తరవాత ఓటీటీ ద్వారా కొన్ని మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘V’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫొటో’ సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి.
By December 24, 2020 at 05:03PM
No comments