Breaking News

2020: విలవిల్లాడిన సినీ పరిశ్రమ.. ఈ పరిస్థితుల్లోనూ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కొత్త డైరెక్టర్లు వీళ్లే..!


కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది అన్ని రంగాలు కుదేలైపోయిన సంగతి తెలిసిందే. సగటు దినసరి కూలీ జేబులో చిల్లిగవ్వ లేక ఆకలితో బిక్కుబిక్కుమంటూ చూసిన సందర్భాలు ఈ 2020లో ఎన్నో చూశాం. ముఖ్యంగా సినీ పరిశ్రమ వెన్ను విరిచింది కరోనా. ఈ వైరస్ దెబ్బకు షూటింగ్స్, థియేటర్స్ అన్నీ బంద్ సినీ కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చింది. థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ బాట పట్టారు దర్శకనిర్మాతలు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోను ఈ ఏడాది చాలా మంది కొత్త దర్శకులు టాలీవుడ్‌లో సత్తా చాటడం విశేషం. HITతో మొదలుపెట్టిన శైలేష్ కొలను విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా HIT. దర్శకుడిగా శైలేష్ కొలనుకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాను హీరో నాని నిర్మించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఫిబ్రవరి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 'హిట్'తో శైలేష్ కొలను కెరీర్ ప్రారంభం కావడంతో టాలీవుడ్‌లో ఆయన మార్క్ కనిపించింది. 'పలాస'తో కరుణ కుమార్ వాస్తవ సంఘటనల నేపథ్యంలో డిఫరెంట్ మూవీతో ఆకట్టుకున్నారు న్యూ డైరెక్టర్ కరుణ కుమార్. 'పలాస 1978' పేరుతో మర్చి 6వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. 1978 సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన సంఘటనలకు తెర రూపమిచ్చి సక్సెస్ అయ్యారు. రక్షిత్‌, నక్షత్ర హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ మూవీ డైరెక్టర్ కరుణ కుమార్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 'భానుమతి రామకృష్ణ'తో శ్రీకాంత్ నాగోతి రొమాంటిక్ డ్రామాగా తన తొలి సినిమా 'భానుమతి రామకృష్ణ' సినిమాను యూత్ ఆడియన్స్‌కి చేరువయ్యేలా రూపొందించారు డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ తెలుగు ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసింది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సలోనీ లుత్రా, షాలినీ, రాజా, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషించారు. జులై 3వ తేదీన 'ఆహా' వేదికపై స్ట్రీమింగ్ అయిన ఈ మూవీతో శ్రీకాంత్ నాగోతి పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. ఛాయ్ బిస్కెట్ ఫేమ్ సందీప్ రాజ్ 'కలర్ ఫోటో' ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్‌లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి క్రేజ్ కొట్టేసిన డైరెక్టర్ సందీప్ రాజ్.. ఆ తర్వాత టాలీవుడ్‌లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాకు పనిచేసి 'కలర్ ఫోటో' సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. వర్ణ వివక్షతను హైలైట్ చేస్తూ న్యాచురల్‌ లవ్‌ స్టోరీని ప్రేక్షకుల ముందుంచి తొలి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయారు సందీప్ రాజ్. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ 'కలర్ ఫోటో' మూవీ ఆహా ఓటీటీ వేదికపై అక్టోబర్ 23న విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. 'మిడిల్‌క్లాస్ మెలోడీస్' అంటూ వచ్చిన వినోద్ అనంతోజు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నవంబర్ 20వ తేదీన అమేజాన్‌లో స్ట్రీమింగ్ అయిన మూవీ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు రూపొందించారు. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ అబ్బాయి కష్టాలను చూపించి ఆకట్టుకున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ సుబ్బు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ బ్యాచిలర్ లైఫ్‌ని వెండితెరపై తనదైన కోణంలో చూపించి సక్సెస్ అయ్యారు కొత్త డైరెక్టర్ సుబ్బు. పెళ్లి చేసుకోవాలా.. సింగిల్‌గా ఉండాలా? అసలు పెళ్లి అనేది అవసరమా? అనే క్రేజీ కాన్సెప్ట్‌కి తెర రూపమిచ్చారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా తొలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో సుబ్బు టాలెంట్ బయటపడింది.


By December 27, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/2020-best-debutante-directors-list-in-tollywood/articleshow/79974856.cms

No comments