Warangal: తండ్రీకొడుకులను మింగేసిన ఆర్టీసీ బస్సు
జిల్లాలో ఘోర చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు తండ్రీకొడుకులను బలితీసుకుంది. బైక్‌ని వెనక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకి చెందిన గజ్జల సంజీవ్(42) బాలసముద్రంలోని అంబేడ్కర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సంజీవ్ కస్టమర్ వద్ద నుంచి డబ్బులు తెచ్చుకునేందుకు తన పెద్దకొడుకు రూఫస్(14)తో కలసి బైక్‌పై బయలుదేరాడు. హన్మకొండ నక్కలగుట్టలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద కాజీపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుంచి బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకుల మరణవార్త విని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన కొడుకు రూఫస్ పదో తరగతి చదువుతున్నాడు. సంజీవ్ భార్య ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఒకేసారి భర్త, కొడుకుని కోల్పోయిన భార్య మాధవి తీవ్రదు:ఖంలో మునిగిపోయింది. నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By November 25, 2020 at 11:28AM
No comments