Breaking News

Vishnu Priya: డబ్బు కోసం అలాంటి పనులా? ఈ జన్మలో చేయను.. బిగ్ బాస్‌పై విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు


బిగ్ బాస్.. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఫేమస్ అయిన బుల్లితెర భారీ పాపులారిటీ షో ఇది. ఈ షో ప్రారంభమైందంటే చాలు సదరు టీవీ చానళ్ల టీఆర్ఫీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోతుంటాయి. రియాలిటీ షోగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినప్పటికీ.. ఈ షోపై విమర్శలు గుప్పించే వారు కూడా ఎక్కువేనండోయ్. ఈ లిస్టులో పలువురు సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ఇందులో కొంతమంది బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అని కామెంట్ చేయగా, ఇంకొందరు మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో తాజాగా యాంకర్, నటి ఈ షోపై ఎవ్వరూ ఊహించని విధంగా మరో రకమైన కామెంట్స్ చేసింది. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకర్ విష్ణుప్రియ.. ‘పోవే పోరా' షోకు బ్రేక్ రావడంతో ఈ మధ్య మరే షోలోనూ కనిపించడం లేదు. చిన్ని తెరకు కాస్త విరామం ఇచ్చి వెండితెరపై అలరించేందుకు రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ.. 'చెక్‌మేట్' అనే మూవీ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో అందాల ఆరబోత, లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయి కనిపించింది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా.. 'చెక్‌మేట్' మూవీ సంగతులతో పాటు బిగ్ బాస్ గురించి మాట్లాడింది. బిగ్ బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభానికి ముందు ఈ షోలో కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ కనిపించనుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని సదరు యూట్యూబ్ ఛానల్ ఆమె వద్ద ప్రస్తావించడంతో షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది విష్ణుప్రియ. తనకు బిగ్ బాస్ అంటే అస్సలు నచ్చదని, ఎన్ని కోట్లిచ్చినా బిగ్ బాస్ వెళ్లనని చెప్పింది. బయట ఇంత అందమైన ప్రపంచాన్ని వదులుకొని ఒక హౌస్‌లో ఉండాల్సిన అవసరమేంటి? అంటూ లాజిక్ మాట్లాడింది. Also Read: అంతటితో ఆగక.. ''బిగ్ బాస్ హౌస్‌లో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి గ్రూప్ నుంచి ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం లైఫ్‌లో ఏ ఒక్కరినీ ఎలిమినేట్ చేయకూడదు. వీలైతే ప్రేమించాలి. కేవలం డబ్బు కోసం అలాంటి పనులు చేయను. అందుకే బిగ్ బాస్ షోకి ఫ్యూచర్‌లో కూడా వెళ్లను. రాసిపెట్టుకోండి. ఒకవేళ వెళ్తే నన్ను బ్లేమ్ చేసేయండి'' అని ఓపెన్‌గా చెప్పింది విష్ణుప్రియ.


By November 27, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-vishnupriya-shocking-comments-on-bigg-boss-show/articleshow/79438968.cms

No comments