Breaking News

సింహంలా లంఘించి వాటర్ క్యానన్ ఆపేసిన యువరైతు.. ఫిదా అవుతున్న నెటిజన్లు


కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన కార్యక్రమాన్ని ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకున్నా అన్నదాతలు మాత్రం వెనక్కు తగ్గలేదు. బారికేడ్లతో అడ్డుకుని, టీయర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించినా మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతున్నాయి. పంజాబ్‌ రైతులను హరియాణా పోలీసులు అడ్డుకోవడంతో గురువారం పలు చోట్ల ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. గంటలపాటు ప్రతిష్టంభన నెలకొన్నా.. పోలీసులు వ్యాటర్ క్యానన్లు ప్రయోగించినా కర్షకులు వెనకడుగు వేయలేదు. ఇప్పటికే వేలాది రైతులు ఢిల్లీని సమీపించారు. రాజధాని నగర సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించి ఉండటంతో శుక్రవారం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని శంభు ప్రాంతంలో ఓ వంతెన వద్ద వందల మంది రైతులు పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను విరిచేశారు. కొన్నింటిని వంతెన పైనుంచి ఘగ్గర్‌ నదిలోకి తోసేసి నల్ల జెండాలు ఊపుతూ, నినాదాలు చేశారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ పోలీసులు హెచ్చరించినా పట్టించుకోలేదు. కొందరు రైతులు ఆగ్రహంతో పోలీసులపైకి ఇటుకలు, రాళ్లు విసిరారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భద్రతా బలగాలను సైతం లెక్కచేయకుండా ఆందోళనలో ఓ యువరైతు చూపిన ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు తమపై వాటర్ క్యానన్లు ప్రయోగిస్తుండగా.. నవదీప్ సింగ్ అనే యువ రైతు ఆ వాహనంపైకి అమాంత ఎక్కి నీళ్లు రాకుండా ట్యాప్ ఆపేశాడు. ఈ హఠాత్పరిణామానికి భద్రతా దళాలు దూరం నుంచి చూస్తూ చేష్టలుడిగిపోయాయి. వ్యాటర్ క్యానన్‌ను ఆపివేసిన వెంటనే, దానిపై నుంచి కిందకు దూకాడు. దానిని లక్ష్యంగా చేసుకున్న అనేక మంది రైతులు ఉత్సాహంతో ముందుకు సాగారు. ఆ యువకుడు అనంతరం దాని ఈ సంఘటన కురుక్షేత్ర సమీపంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు.


By November 27, 2020 at 08:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/protesting-farmer-jumped-on-water-cannon-to-turn-tap-off-and-created-an-iconic-moment/articleshow/79438356.cms

No comments