Breaking News

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆన్ ఫైర్.. నడకలో నందమూరి రాజసం.. వీర లెవల్ అంతే!!


దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా . యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో విడుదలకు ముందే RRRపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన '' వీడియో నెట్టింట అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. మార్చి నెలలో విడుదలైన రామ్ చరణ్ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో యూట్యూబ్‌లో దుమ్ముదులపగా.. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఆన్‌లైన్ సెన్సేషన్ అయింది. నిజానికి ఈ వీడియోపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా రికార్డుల వేటలో మాత్రం ముందంజలో ఉండటం విశేషం. అక్టోబర్ 22వ తేదీన విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఈ రేంజ్ కామెంట్లు దక్కించుకున్న మొదటి టీజర్‌గా 'రామరాజు ఫర్ భీమ్' వీడియో నిలిచింది. అలాగే యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ వీడియో ఇప్పటివరకు 3 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టడం గమనార్హం. Also Read: ఇకపోతే లాక్‌డౌన్ కంటే ముందే RRR మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన రాజమౌళి.. రీసెంట్‌గా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భుజాన బ్యాగ్ వేసుకొని, మాస్క్ ధరించి ఎన్టీఆర్ అలా నడుస్తూ వస్తున్న ఓ పిక్ తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పిక్ చూసిన ఫ్యాన్.. ''ఆ నడకలో నందమూరి రాజసం ఉట్టిపడుతోంది. వీర లెవల్ అంతే'' అంటూ కామెంట్ చేస్తున్నారు. RRRలో తన పార్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యాక వస్తుండగా తీసిందే ఈ పిక్ అని సమాచారం. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి RRR (రౌద్రం రణం రుధిరం) రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రీయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.


By November 29, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-n-t-rama-rao-jr-latest-look-viral-on-social-media/articleshow/79470927.cms

No comments