Breaking News

ఫోన్ ఎత్తని భర్త.. నోరుజారి దొరికిపోయిన భార్య, శ్రీకాకుళంలో దారుణం


వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలసి ప్లాన్ చేసిందో కసాయి భార్య. తన భర్తను చంపేయాలని ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. అతను అదను చూసి ప్రియురాలి భర్తను దారుణంగా చంపేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన భర్త ప్రమాదవశాత్తూ చనిపోయాడంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి హైడ్రామాకు తెరతీసింది. అయితే భర్త ఫోన్ ఎత్తడం లేదని భార్య ఫోన్ చేసిన ఫ్రెండ్‌‌తో నోరుజారి అడ్డంగా బుక్కైంది. ఈ అత్యంత దారుణ ఘటన పట్టణంలో జరిగింది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడకి చెందిన అంబటి అసిరిపోలి(36)కి సమీపంలోని వెంకన్నగారిపేటకి చెందిన మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు సంతానం. భర్త అసిరిపోలి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. అతని భార్య కూడా కూలీ పనులకు వెళ్లేది. ఆ సమచంలో గార మండలం అంపోలుకి చెందిన గొండు షణ్ముఖతో మూడేళ్ల కిందట పరిచయమైంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని అసిరిపోలి భార్యను హెచ్చరించాడు. ప్రియుడి మోజులో కళ్లు మూసుకుపోయిన భార్య తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అంతమొందిచాలని నిర్ణయించుకుంది. ప్రియుడికి ఫోన్ చేసి తన భర్తను చంపేయాలని కోరింది. భర్త అసిరిపోలి, ప్రియుడు షణ్ముఖ శ్రీకాకుళం జీటీ రోడ్డులోని ఓ జ్యూవెలరీ షాపు నిర్మాణ పనులకు వెళ్లారు. అక్కడే ఎవరూ లేని సమయం చూసి ప్రియురాలి భర్త అసిరిపోలిపై షణ్ముఖ రాయితో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో పక్కనే ఉన్న లిఫ్టు గుంతలోకి తోసేశాడు. తీవ్రగాయాలపాలైన అసిరిపోలి మృతి చెందాడు. భర్తను చంపేసిన విషయాన్ని షణ్ముఖ తన ప్రియురాలికి ఫోన్ చేసి చెప్పాడు. అదే సమయంలో అసిరిపోలి ఫోన్ ఎత్తడం లేదంటూ అతని స్నేహితుడు రమణ భార్యకి ఫోన్ చేశాడు. వెంటనే ఆమె కొత్త డ్రామాకు తెరతీసింది. జీటీ రోడ్డులో పనికి వెళ్లాడని.. అక్కడ చూడమని చెప్పింది. అప్పటికే భర్తని చంపేసిన విషయం తెలిసిన భార్య.. అక్కడి లిఫ్ట్‌ గుంతలో కూడా చూడాలంటూ నోరుజారి ఇరుక్కుపోయింది. అనంతరం ప్రమాదవశాత్తూ కాలుజారి లిఫ్ట్ గుంతలో పడి తన భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మరోనాటకానికి తెరలేపింది. Also Read: సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అసిరిపోలి మృతదేహంపై గాయాలు ఉండడంతో పోలీసులకు అనుమానాలు రేగాయి. అక్కడే పనిచేస్తున్న షణ్ముఖతో మృతుడి భార్యకి వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. భార్య, ప్రియుడు షణ్ముఖని స్టేషన్‌కి తీసుకెళ్లి తమ స్టైల్లో విచారించడంతో నిందితులు అసలు నిజం కక్కేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరినీ కటకటాల వెనక్కి నెట్టారు. Read Also:


By November 28, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-paramour-over-extramarital-affair-in-srikakulam/articleshow/79459761.cms

No comments