PM Modi: విదేశాలకు అక్రమంగా వెళ్లిన మన సంపద తిరిగొస్తోంది..
భారత్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలివెళ్లిన సంపద తిరిగి మనకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా నేడు (నవంబర్ 29) మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నుంచి అక్రమంగా తరలించిన అనేక పురాతన విగ్రహాలు, వస్తువులను వెనక్కి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేస్తు్న్న ప్రయత్నాలు ఫలించాయని తెలిపారు. ఈ క్రమంలో త్వరలో కెనడా నుంచి వందేళ్ల కిందటి అన్నపూర్ణా దేవి విగ్రహం తిరిగి రానుందని వెల్లడించారు. వారణాసి నుంచి కొంత మంది దుండగులు దాదాపు 1913వ సంవత్సరంలో అరుదైన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని దొంగిలించి విదేశాల్లో అమ్మేశారని మోదీ వెల్లడించారు. కెనడా ప్రభుత్వంతో మాట్లాడి ఆ విగ్రహం భారత్‌కు వచ్చేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కెనడా ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారసత్వ సంపదను కాపాడటంలో ఇకపై సరికొత్త సాంకేతికతను వినియోగించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియమ్స్, గ్రంథాలయాలు, ఇతర ప్రదర్శనశాలలు పూర్తిగా డిజిటలీకరణ దిశగా సాగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో కీలక చర్యలు చేపట్టినట్లు వివరించారు. మ్యూజియంలో 10 వర్చువల్ గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారని.. అవి త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. మన పూర్వీకుల సంపదను కాపాడటంలో టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. త్వరలో అజంతా గుహలను కూడా డిజిటలైజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల భావితరాలకు మన దేశ ఘనమైన వారసత్వ సంపద అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల లాంటి ప్రత్యేక రోజులు నిర్వహించడం మన దేశ సంస్కృతిని, వారసత్వ సంపదను అర్థం చేసుకునేందుకు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. Must Read: Also Read: Every Indian will be proud to know that a very old idol of Devi Annapurna is being brought to India from . This idol was stolen from and smuggled out of India some 100 years ago.
By November 29, 2020 at 02:51PM
No comments