Breaking News

Outer ring road: ఘోర కారు ప్రమాదం.. తల్లీకూతుళ్ల మృతి


ఔటర్ రింగురోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 నెలల చిన్నారి సహా తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ వద్ద ఔటర్ రింగురోడ్డుపై జరిగింది. రహదారిపై ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వేగనార్ కారు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి త్రివేణి, 11 నెలల కూతురు రితిక మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:


By November 22, 2020 at 11:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-two-killed-in-car-accident-on-outer-ring-road/articleshow/79348916.cms

No comments