Breaking News

Nithiin: 'ఏమిటో ఇది' అంటూనే కీర్తిసురేష్‌తో నితిన్ రొమాన్స్.. వైరల్ అవుతున్న వీడియో క్లిప్


ఏమిటో ఇది వివరించలేనిది.. అంటూ కీర్తిసురేష్‌తో టాలీవుడ్ యంగ్ హీరో చేసిన రొమాన్స్ తాలూకు వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. నితిన్ లేటెస్ట్ మూవీ '' ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ''ఏమిటో ఇది'' అంటూ సాగిపోతున్న ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. కేవలం 29 సెకనుల నిడివితో విదిలిన ఈ వీడియోలో మెలోడియస్ ట్యూన్‌కి తోడు కీర్తిసురేష్- నితిన్ రొమాంటిక్ సీన్స్ యువతను మైమరిపిస్తున్నాయి. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ రాయగా.. కపిల్‌ కపిలన్‌, హరిప్రియ ఆలపించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై నితిన్, జంటగా 'రంగ్ దే' మూవీ తెరకెక్కుతోంది. తొలిప్రేమ, మజ్ను వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. Also Read: ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇటలీలో పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. యువతకు కావాల్సిన అన్ని అంశాలతో 2021 సంక్రాంతి కానుకగా ఈ 'రంగ్ దే' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


By November 06, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/emito-idhi-lyrical-prelude-from-nithiins-rang-de-movie/articleshow/79075553.cms

No comments