Naga Chaitanya: సమంతను తొలిసారి చూసింది అప్పుడే.. ఇంట్లో చెప్పడానికి భయమేసి..! క్రేజీ సీక్రెట్స్
అక్కినేని వారసుడిగా సినీ గడపతొక్కి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న నాగచైతన్య. తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జునలా తన లోనూ జోష్ ఉందని నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. మరోవైపు జీవిత భాగస్వామిగా హీరోయిన్ సమంతను ఎంచుకొని ఆమెను ప్రేమించి పెళ్లాడారు చైతూ. అప్పటినుంచి తెలుగు ప్రేక్షకుల్లో క్రేజీ జోడీగా కీర్తించబడుతున్నారు ఈ సెలబ్రిటీ జంట. అయితే నేడు (నవంబర్ 23) చైతూ పుట్టినరోజు సందర్భంగా సమంతతో ఆయన ప్రేమ, పెళ్లి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చూస్తే.. 'ఏమాయ చేసావె' సినిమా ఆడిషన్స్‌లో తొలిసారి ఫొటో చూడగానే అట్రాక్ట్ అయ్యారట . ఈ అమ్మాయి చాలా బాగుందని అనుకున్నారట. కానీ ఆమెనే తన జీవిత భాగస్వామి అవుతుందని ఆయన అస్సలు ఉహించలేదట. సమంతని నేరుగా ఇంటికి తీసుకెళ్లి..‘మీ కోడలు’ అనేయకుండా పెళ్లికి ముందు ఇంట్లో జరిగే పార్టీలకు తీసుకెళ్తుండటం లాంటివి చేస్తూ తన ఇంటి వాతావరణాన్ని పరిచయం చేశాక అసలు విషయం బయటపెట్టారట నాగ చైతన్య. Also Read: సామ్‌ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడానికి చైతూ చాలా భయపడ్డారట. కానీ ఆ విషయం చెప్పగానే ఫ్యామిలీ అంతా అర్థం చేసుకొని పెళ్లికి ఓకే చెప్పారట. అయితే సమంతను పెళ్లి చేసుకుంటా అనే విషయం చెప్పగానే నాన్న.. ‘సమంతనే ఎందుకు చేసుకుంటావ్? చేసుకుంటే మీ ఇద్దరూ సంతోషంగా ఉండగలరా? అయినా మీ ప్రేమ విషయం నాకు ఎప్పుడో తెలుసు..’ అన్నారని, తల్లిదండ్రులుగా వారి బాధ్యతలు నిర్వర్తించారని పెళ్లికి ముందు పరిస్థితిని ఓ సందర్భంలో నాగ చైతన్య వివరించారు. సమంతది సర్దుకుపోయే వ్యక్తిత్వం అని, ఆమె మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి పైగా చాలా కష్టపడి పైకొచ్చింది కాబట్టి అన్నీ అర్థం చేసుకుంటుందని చైతూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. సామ్ మైండ్‌సెట్ చాలా బాగుంటుందని అన్నారు. కాగా ప్రస్తుతం చైసామ్ జోడీ మాల్దీవుల్లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. చైతూ బర్త్ డే సందర్భంగా ఈ ట్రిప్ వేశారని సమాచారం.
By November 23, 2020 at 10:15AM
No comments