Breaking News

ఢీ సీక్వల్‌పై ఫుల్ క్లారిటీ.. డబుల్ డోస్‌ ఇవ్వబోతున్న మంచు వారబ్బాయి.. పదమూడేళ్ల తర్వాత మళ్ళీ!


మంచు విష్ణు- కాంబోలో వచ్చిన 'ఢీ' ఎంతగా ఎంటర్‌టైన్ చేసిందనేది మనందరికీ తెలుసు. విష్ణు జోడీగా జెనీలియా, బ్రహ్మానందం, సునీల్ అంతా కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దీంతో కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కాగా ఈ సినిమాకు సీక్వల్ రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ 'ఢీ' సీక్వల్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు డైరెక్టర్ శ్రీను వైట్ల. నేడు (నవంబర్ 23) విష్ణు పుట్టినరోజు కానుకగా తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. Also Read: కాస్త వెరైటీగా 'డి & డి' అని టైటిల్ కన్ఫర్మ్ చేసిన చిత్రయూనిట్ దీనికి ''డబుల్ డోస్'' అనే ట్యాగ్ లైన్ పెట్టి అప్పటికంటే ఇంకా ఎక్కువ వినోదం పంచబోతున్నామని చెప్పకనే చెప్పింది చిత్రయూనిట్. 2007లో ఢీ మూవీ ప్రేక్షకుల ముందుకురాగా.. 13 ఏళ్ల తర్వాత ఢీ సీక్వల్ అనౌన్స్ చేయడం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు అవరాం భక్త సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చనున్నారు. చిత్రంలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు అతిత్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్.


By November 23, 2020 at 12:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vishnu-manchu-sreenu-vaitlas-d-d-announced-with-title-poster/articleshow/79364167.cms

No comments