Breaking News

Mahesh Babu: విరాట్ కోహ్లీకి మహేష్ బాబు స్వీట్ విషెస్.. ఏమన్నారో తెలుసా..?


నేడు (నవంబర్ 5) భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ పుట్టినరోజు. నేటితో 31 ఏళ్ళు పూర్తిచేసుకొని 32వ యేట అడుగు పెడుతున్నారు ఈ సూపర్ బ్యాట్స్‌మెన్. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సినీ, క్రీడా ప్రముఖులు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ తన స్వీట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. Also Read: ''నా అభిమాన క్రికెటర్లలో ఒక‌రైన విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు. భవిష్యత్తులో మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ భార‌తదేశం గ‌ర్వించేలా చేయాలని కోరుకుంటున్నా. దూసుకుపో..'' అంటూ సినీ, క్రీడాభిమానులు హుషారెత్తిపోయేలా మహేష్ విష్ చేశారు. ఈ మేరకు కోహ్లీ ఫోటో షేర్ చేశారు మహేష్. ఇక ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇటీవలే తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. తన సతీమణి అనుష్క శర్మ గర్భంతో ఉన్న విషయాన్ని చెబుతూ ''2021 జనవరి నెలలో మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం'' అని అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో లాక్‌డౌన్ విరామ సమయంలో ఈ గుడ్ న్యూస్ చెప్పి సర్‌ప్రైజ్ చేసిన విరుష్క జోడీకి బెస్ట్ విషెష్ చెప్పరంతా. ఇక మ‌హేష్ బాబు విషయానికొస్తే.. ప్ర‌స్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ లుక్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


By November 05, 2020 at 12:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-best-wishes-on-virat-kohli-birth-day/articleshow/79056988.cms

No comments