Love Story: వైరల్ అవుతున్న నాగ చైతన్య లుంగీ లుక్.. భర్తపై సమంత కామెంట్
నేడు (నవంబర్ 23) అక్కినేని 34వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో లుంగీ కట్టి అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నారు చైతూ. అయితే ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్న సమంత.. భర్త నాగ చైతన్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ''ఎల్లప్పుడూ నీ సొంత ఆలోచనలతో ఇలాగే ముందుకెళ్లు.. నీకు నచ్చినట్లుగా హాయిగా జీవించు'' అని పేర్కొన్నారు. సమంత చేసిన ఈ ట్వీట్ చూసి సూపర్ అంటూ నాగ చైతన్యకు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ '' సినిమాలో చైతూ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఫినిష్ అయింది కానీ థియేటర్స్ రీ ఓపెన్ కాకపోవడంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: ఇక ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన చైతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూస్తే.. ఆయన లుంగీ, బనియన్ మీద కనిపిస్తున్నారు. నిత్య జీవితంలో మనల్ని మనం పోల్చుకునే ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగ చైతన్య సహజంగా నటిస్తున్నట్లు ఈ లుక్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ క్యారెక్టరైజేషన్ చైతూ లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.
By November 23, 2020 at 01:46PM
No comments