Breaking News

నేషనల్‌ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన.. క్రేజీ బ్యూటీకి అరుదైన ఘనత


కన్నడ కిర్రిక్‌ పార్టీతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన .. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. వరుస అవకాశాలు పట్టేస్తూ స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్‌గా మారింది. క్లాస్, మాస్ ఆడియన్స్ అమ్మడి నటనా ప్రతిభకు ఫిదా అయ్యారు. 'గీత గోవిందం' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా ''సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' సినిమాలతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మికకు గూగుల్‌ అరుదైన ఘనత సాదించింది. 2020 సంవత్సరానికి గాను 'నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా'గా రష్మిక మందనను ప్రకటించింది గూగుల్. 2019-20 మధ్యకాలంలో ఎక్కువగా రష్మిక పేరును సెర్చ్ చేసినట్లుగా గూగుల్‌ తన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఈ క్రమంలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది రష్మిక. ''వావ్!! మీరంతా నిజంగా లెజండ్స్‌. అంతేకాదు చాలా క్యూట్ కూడా. కాదాంటరా..! మీ అందరికీ నా హృదయంలో చోటుంది'' అంటూ అందరిపై ప్రేమ కురిపించింది ఈ కన్నడ బ్యూటీ. Also Read: వరుస విజయాలందుకుంటూ తెలుగు తెరపై దూసుకుపోతున్న రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పల్లెటూరు పిల్లలా రష్మిక స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుంది. అలాగే ఇటీవలే శర్వానంద్ హీరోగా రూపొందబోతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాకు కూడా సంతకం చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే కన్నడలో 'పొగరు', తమిళంలో 'సుల్తాన్' సినిమాలు చేస్తూ చాలా బిజీ షెడ్యూల్స్‌ పెట్టుకుంది.


By November 23, 2020 at 03:12PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/google-declares-rashmika-mandanna-2020-national-crush-of-india/articleshow/79367186.cms

No comments