Guntur: భార్య న్యూడ్ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టిన భర్త.. దారుణం
గుంటూరులో బీటెక్ విద్యార్థినిని నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఈజీ మనీ కోసం భార్య నగ్న వీడియోలను కట్టుకున్న భర్తే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. భర్త వికృత చేష్టలు పసిగట్టిన భార్య పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన మహిళ తన నగ్న వీడియోలను భర్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కలకలం రేపుతున్న ఈ ఘటన వివరాలు.. పనీపాటా లేకుండా తిరిగే పోకిరీ యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఈజీ మనీ కోసం అత్యంత నీచానికి ఒడిగట్టాడు. భార్యతో ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన విషయం తెలుసుకున్న భార్య నేరుగా పోలీసులను ఆశ్రయించింది. నీచపు భర్త బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దిశా పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు. ఐటీ కోర్ బృందం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. Also Read:
By November 22, 2020 at 12:16PM
No comments