Breaking News

తరుణ్‌ని పెళ్లి చేసుకుంటావా?.. అని వాళ్లమ్మ అడిగారు: ప్రియమణి


బాలనటుడిగానే అందరినీ మెప్పించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ‘నువ్వే కావాలి’ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో యూత్‌లో తరుణ్‌కి స్టార్ హీరోలను మించి క్రేజ్ ఉండేది. హిట్లతో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోగా ఎదిగాడు. అయితే ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా తరుణ్ కెరీర్‌ పడిపోయింది. అదే సమయంలో 2005లో ‘నవ వసంతం’ అనే సినిమా చేశాడు. అందులో హీరోయిన్. ఆ సమయంలోనే ప్రియమణి, తరుణ్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు ప్రచారం జరిగింది. దాని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి చెప్పుకొచ్చారు. ‘‘నవ వసంతం’ సినిమా చేస్తున్న సమయంలో తరుణ్, నేను ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకోబోతున్నామని వార్తలొచ్చాయట. ఈ విషయం తెలుసుకున్న తరుణ్ అమ్మ రోజా రమణి గారు షూటింగ్ స్పాట్‌కి వచ్చి నన్ను కలిశారు. ‘మీరిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా?.. అదే నిజమైతే మీ పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఉంటే సంకోచించకుండా చెప్పేయండి’... అని అన్నారు. ఆమె చెప్పేంతవరకు మా గురించి ఆ విధంగా ప్రచారం జరుగుతోందని నాకు తెలీదు. ఒకే హీరోతో వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తేనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది. కానీ మేమిద్దరం కలిసి ఒక్క సినిమాలోనే నటించాం. అయినప్పటికీ మా గురించి పుకార్లు రేపారు’ అని ప్రియమణి చెప్పారు. Also Read: చాలాకాలంగా వెండితెరకు దూరమైన తరుణ్ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ద్వారా స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ముందుగా ఓ వెబ్ సిరీస్‌ తీసి.. ఆ తర్వాత సినిమా రంగం వైపు వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు త్వరలోనే తరుణ్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. రోజా రమణి బెస్ట్ ఫ్రెండ్‌ కూతురితో పెళ్లి ఫిక్స్ అయిందని, ఆమె ఇటీవలే విదేశాల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి వచ్చినట్లు సమాచారం. Also Read:


By November 22, 2020 at 11:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-priyamani-shocking-comments-on-marriage-with-tarun/articleshow/79349183.cms

No comments