హారికా.. హగ్ ఇవ్వవా? కుర్చీలోనుంచి కింద పడిపోయేటంత గట్టి హగ్ ఇస్తా అభి: ముదిరిన యవ్వారం
అసలే ఆమె దేత్తడి .. ఆఫ్ట్రాల్ ఈతలో గెలిస్తేనే ముద్దిస్తా అని అభికి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బోల్డ్ కంటెంస్టెంట్... అలాంటిది ఆమెనే ఇప్పుడు అభి వెళ్లి నాకు హగ్ ఇచ్చి ఎన్నిరోజులైంది.. నాపై ప్రేమ తగ్గిపోయింది అని అంటే ఇక రేపటి నుంచి ఎన్ని సిత్రాలు చూపిస్తుందో ఏమో అనేట్టుగా చేశాడు . హీరోగా వెండితెరపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో బుల్లితెరపై సత్తా చూపిస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అభిజిత్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. అయితే మనోడు మొదట్లో మెనాల్‌గా బాగా పులిహోర కలిపేవాడని.. ఈ సీజన్‌కి పులిహోర రాజాగా ట్యాగ్ ఇచ్చేశారు. ఈ ట్యాగ్ విషయంలో అఖిల్ కూడా గట్టి పోటీ ఇచ్చాడనుకోండి అది వేరే విషయం కాగా.. మోనాల్ గొడవైన తరువాత అభిజిత్ హారికతో బాగా క్లోజ్ అయ్యాడు. ఇక హారిక అయితే అభిజిత్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటూ అతన్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. అర్థరాత్రి వరకూ ముచ్చట్లు.. ముద్దులు, హగ్‌లతో వేడిపుట్టిస్తోంది. ఇదంతా జస్ట్ ఫ్రెండ్ షిప్ మచ్చా అంటూ రచ్చలేపడంలో హారిక బాగా ఆరితేరిపోయింది. అయితే అభిజిత్.. మోనాల్, హారికలతోనే కాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన స్వాతి దీక్షిత్‌తో కూడా బాగానే పులిహోర కలిపేవాడు. వచ్చిన రోజు రాత్రే ముచ్చట్లు పెట్టడంతో మనోడు ఎవర్నీ వదిలేలా లేడే అనే కామెంట్లు వినిపించాయి. గేమ్‌లోనే కాదు.. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడంలో స్మార్ట్ గేమర్ అనేలా అమ్మాయిలతో బాగా క్లోజ్‌గా కనిపిస్తూ ఉంటాడు అభిజిత్. అయితే హారిక విషయంలో ఇంకాస్త క్లోజ్‌గా కనిపిస్తూ ఉంటడంతో వీళ్లిద్దరిదీ స్పెషల్ ప్యాకేజ్ అని హోస్ట్ నాగార్జునే తేల్చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే రూమర్లు రెక్కలు కట్టుకున్నాయి. ఇక హారిక కూడా.. అభిజిత్ తన ఫ్యామిలీ మెంబర్ అని.. టాస్క్‌లలో ఆపోజిట్ టీంలలో వేస్తున్నా తట్టుకోలేక.. బిగ్ బాస్ గేమ్‌నే అన్ ఫెయిర్ అనేస్తోంది. దొంగా.. మా ఇద్దర్నీ ఆపోజిట్ టీంలలో ఎందుకు వేశావ్’ అంటూ బిగ్ బాస్‌ని ప్రశ్నించే వరకూ వెళ్లింది వీళ్ల యవ్వారం. ఇక హారిక సంగతి పక్కనపెడితే.. అభిజిత్ హారిక అంతా ఫాస్ట్ కాకపోయినా రెచ్చగొట్టి వదిలేయడంలో మహా దిట్ట అని మరోసారి రుజువు చేశాడు. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో హారిక హగ్ కోసం పరితపించిపోయాడు.. నాకు నువ్ హగ్ ఇచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? నాకు ఇవ్వకుండా అఖిల్‌కి ఇస్తావా? అంటూ ఓపెన్ అయ్యాడు. అఖిల్‌కి ఇచ్చిందన్న బాధో లేక తనకు ఇవ్వడం లేదన్న కోపమో తెలియదు కానీ.. సిగ్గు విడిచి హారికను హగ్ అడిగేశాడు అభిజిత్. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా హారిక-అఖిల్‌ల గురించి మాట్లాడిన అభిజిత్.. ‘కనీసం హారిక ఉంటే.. అక్కడ చోటూ గాడూ అదీ ఇదీ అని మాటలు మాట్లాడి ఏదోటి చేస్తావ్.. నేను ఉంటే ఏం ఉంటుంది అక్కడ’ అంటూ అభిజిత్ అనడంతో.. ‘నన్ను ఇన్ డైరెక్ట్‌గా వేసుకుంటున్నావా? అంటూ చిలిపిగా నవ్వుతూ అభిజిత్‌ని కొంటెగా చూసింది హారిక. నువ్ పోయి హగ్‌లు ఇచ్చుకో.. అని అనడంతో సొహైల్‌ని అనుకుని ఏదోదో చెప్పుకొచ్చింది హారిక. అయితే నేను నువ్ హగ్‌లు ఇచ్చావ్ అన్నది సొహైల్ గురించి కాదు.. అని అనడంతో.. ఎవరెవరికి హగ్‌లు ఇచ్చినా ఏమో అని గుర్తు చేసుకుని హో అఖిలా అని అడిగింది హారిక. ఏమో నీకే తెలియాలి.. నువ్ ఎవరికి హగ్‌లు ఇస్తున్నావో.. నువ్ నా దగ్గరకు రాకు అని అభిజిత్ అలిగాడు. ఇక హారిక తలను గిరాగిరా తిప్పుతూ హెయిర్‌ని ఎగరేస్తూ.. ‘చూడు నేను వాడికి హగ్ ఇచ్చాను కదా అని వాడు నాకు సపోర్ట్ చేయాలని ఎక్స్ పెక్ట్ చేయను. నేను ఆ టైంలో హగ్ ఇస్తున్నా అంటే అది ప్రేమతోనే ఇస్తున్నా.. తరువాత వాడు చేయట్లేదు అంటే అది మ్యాటర్ కాదు’ అని హారిక చెప్పింది. దీంతో అభిజిత్ ఇక ఓపెన్ అయిపోయి.. ‘నువ్ నాకు హగ్ ఇచ్చి ఎన్ని రోజులైందో తెలుసా?? నువ్ నాకు హగ్ ఇచ్చింది నోయల్.. వెళ్లే ముందు. నోయల్ మెడికల్ రూంకి పోతే నువ్ బాధపడుతున్నావని ఓదార్చడానికి హగ్ ఇచ్చా.. అది కూడా నేను నీకు హగ్ ఇచ్చా.. నువ్ ఇవ్వలేదు’ అని తెగ బాధపడిపోయాడు అభిజిత్. హేయ్ వాట్ ఆర్ యూ టాకింగ్.. మార్నింగ్ హగ్ ఇస్తున్నాగా.. ఇదుగో నువ్ హగ్ కావాలంటే చైర్‌లో నుంచి పడిపోతావ్.. అంత గట్టిగా ఇస్తా.. అయినా నువ్ నాతో కొట్లాడుతున్నావ్.. తిడుతున్నావ్ అందుకే హగ్ ఇవ్వట్లేదు అని తెగ గారం చేసింది హగ్ బేబీ హారిక. ‘నీకు నామీద ప్రేమ తగ్గిపోయింది.. నువ్ నాకు హగ్‌లు ఇవ్వడం లేదు.. నువ్ నా దగ్గర లేవు.. నాకు నీ మీద క్లారిటీ ఉంది.. మోనాల్‌పై అయితే జీరో ఉంది’ అని ఓపెన్ అయిపోయాడు అభిజిత్. అయితే వీళ్లు హగ్‌పై చర్చపచర్చలు జరుపుతుంటో ఏం మాట్లాడాలో తెలియక పక్కనే ఉన్న లాస్య... ఇదేదో కథ తేడాగా ఉందే అనుకుని అక్కడ నుంచి లేచివెళ్లిపోయింది. మొత్తానికి అభిజిత్.. నా మీద ప్రేమ లేదు.. హగ్ లేదు అని అనడంతో హారిక ముందు ముందు ఎలాంటి సిత్రాలు చూపిస్తుందో మరి.
By November 11, 2020 at 01:46PM
No comments