Breaking News

సుప్రీంలో అర్ణబ్ బెయిల్ పిటిషన్.. విచారణలో ధర్మాసనం ఆసక్తికర వ్యాాఖ్యలు


ఇంటీరీయర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో, బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అర్ణబ్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఛానెల్‌ను చూడటం లేదు, రాజ్యాంగబద్దమైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోకపోతే వినాశకరమైన మార్గంలో ప్రయాణిస్తాం అని వ్యాఖ్యానించారు. ఎఫ్ఐఆర్ నిజమైందని ఊహిస్తే అది దర్యాప్తు విషయం కానీ, డబ్బు చెల్లించకపోతే ఆత్మహత్యకు ప్రేరేపించినట్టేనా? ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉన్నప్పుడు బెయిల్ మంజూరు చేయకపోతే అది న్యాయాన్ని అపహాస్యం చేసినట్టే అవుతుంది. .. మాకు సంబంధిస్తే నేను ఛానెల్‌ని చూడను.. మీ భావజాలంతో విభేదించవచ్చు, కానీ రాజ్యాంగ న్యాయస్థానాలు ఈ సమయంలో జోక్యం చేసుకోకపోతే వినాశానికి మార్గం చూపినవారమవుతాం’ అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. పౌరుల స్వేచ్చను కాపాడేందుకు తామున్నాం.. మనది అసాధారణ, బలమైన ప్రజాస్వామ్యం.. విషయం ఏమిటంటే, ప్రభుత్వాలు తమపై చేసిన విమర్శలను విస్మరించాలి (టీవీలో చర్చలు) ఎన్నికల్లో ఇవి ఆధారం కాదు. వారు చేసిన విమర్శలతో ఎన్నికల్లో మీకు (మహారాష్ట్ర) ఏమైనా నష్టం జరిగిందా? అని ప్రశ్నించింది. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసుల తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.


By November 11, 2020 at 01:55PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/i-dont-watch-his-channel-but-says-supreme-court-on-arnab-goswami-bail-plea/articleshow/79167667.cms

No comments