ఒంగోలు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. తిరుపతిలో పెళ్లి చేసుకుని వస్తుండగా.!
ప్రకాశం జిల్లాలో ఘోర చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం బైపాస్ వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన టెంపో ట్రావెలర్ ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. తెల్లవారుజాము సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. జిల్లా తెనాలికి చెందిన కుటుంబం తిరుపతిలో పెళ్లి ముగించుకుని వధూవరులతో తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది. లారీని వెనక నుంచి బలంగా ఢీకొనడంతో టెంపో నుజ్జునుజ్జయింది. వాహనం ముందు భాగం సగానికిపైగా ఛిద్రమైంది. ప్రయాణికులు వాహనంలో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రోడ్డు భద్రతా సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కట్టర్ల సాయంతో వాహనం ఇనుప రాడ్లను తొలగించి వాహనంలో ఇరుక్కుపోయిన నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వధూవరులు వాహనంలో ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By November 22, 2020 at 10:37AM
No comments