కోడలితో మామ నీచ ప్రవర్తన.. కొడుక్కి తెలియడంతో.!
కన్నకూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేశాడో మామ. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయం కొడుక్కి తెలియడంతో దారుణం జరిగిపోయింది. తన భార్యను వేధించాడన్న కోపంతో కన్నతండ్రిని కిరాతకంగా హతమార్చాడు. దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు.. ఢిల్లీకి చెందిన దిలీప్ కొడుకు భార్యపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ నీచం ప్రవర్తించాడు. ఆ విషయం కొడుకు అవ్‌దేశ్(24) తెలియడంతో కోపంతో రగిలిపోయాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిని ఆవేశంలో దారుణంగా చంపేశాడు. దుపట్టా గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి అమానుషంగా అంతమొందించాడు. ఆ ఘటన జరిగిన కొద్దిసేపటికి దిలీప్ చిన్నకొడుకు ఇంటికొచ్చాడు. అప్పటికే తండ్రి విగతజీవిగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కోడలితో అసభ్యంగా ప్రవర్తించడంతో కొడుకే హత్య చేశాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ మేరకు నిందితుడు అవ్‌దేశ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By November 18, 2020 at 12:06PM
No comments