ప్రజా సేవల్లో లంచాలు: ఆసియాలో అగ్రస్థానం భారత్‌దే.. అత్యధికంగా ఆ విభాగంలోనే!
దేశంలో గడచిన 12 నెలలుగా అవినీతి పెరిగిందని నమ్ముతున్నట్టు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. సర్వేలోని పాల్గొన్న 47 శాతం మంది ప్రజలు ఈ అభిప్రాయం వ్యక్తం చేయగా.. వీరిలో 63 శాతం మంది అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అభిప్రాయపడ్డారు. అయితే, ఆసియా ప్రాంతంలోని మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లోనే అవినీతి ఎక్కువగా ఉంది. Read Also: అయితే, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం.. ఆసియా ప్రాంతంలో అత్యధిక లంచం రేటు 39 శాతంతో భారత్ ముందు వరుసలో నిలవడం గమనార్హం. ప్రజా సేవలను పొందటానికి అత్యధికంగా 46 శాతం మంది వ్యక్తిగత సంబంధాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత పరిచయాలు ఉపయోగించకపోతే ప్రభుత్వ సేవలను పొందలేమని లంచం ఇచ్చిన దాదాపు 50 మందిలో 32 శాతం మంది పేర్కొన్నారు. Read Also: ఈ ఏడాది జనవరిలో దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి అవగాహన సూచిలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. తాజాగా, ‘’పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో 17 ఆసియా దేశాల్లోని 20వేల మంది పాల్గొన్నారు. జనవరి-సెప్టెంబరు మధ్య నిర్వహించిన ఈ సర్వేలో అవినీతి విషయంలో ప్రజలకు ఎదురైన అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. పోలీస్, కోర్టు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధ్రువీకరణ పత్రాలు, యుటిలీటులు సేకరణ ఈ ఆరు ప్రజా సేవల గురించి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. Read Also: అత్యధికంగా పోలీసులు, ధ్రువీకరణ పత్రాలకు లంచం ఇస్తున్నట్టు 42 శాతం మంది వెల్లడించారు. వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే గుర్తింపు పత్రాలకు 42 శాతం, పోలీసులు 39 శాతం, కోర్టులు 38 శాతం మంది ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రజా సేవల్లో లంచం భారతదేశాన్ని పీడిస్తూనే ఉంది. సంక్లిష్టమైన బ్యూరోక్రాటిక్ ప్రక్రియ, అనవసరమైన నిబంధనలు, అస్పష్టమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లు పౌరులను అవినీతి నెట్‌వర్క్‌ల ద్వారా ప్రాథమిక సేవలను పొందటానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించేలా ప్రేరేపిస్తున్నాయని నివేదిక వ్యాఖ్యానించింది. నివేదికలో ప్రతిబింబించే ఆందోళనకర సమస్య ఏమిటంటే.. అవినీతిని వ్యాప్తిని అరికట్టడానికి కీలకం.. భారతదేశంలో 63 శాతం మంది ప్రతీకారం తీర్చుకోవడం గురించి ప్రత్యేకించి ఆందోళన చెందారు. Read Also: ‘జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సేవల కోసం పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించడం.. లంచం, స్వపక్షపాతాన్ని ఎదుర్కోవడానికి నివారణ చర్యలను అమలు చేయడం.. అవసరమైన ప్రజా సేవలను త్వరగా, సమర్థవంతంగా అందజేయడానికి వినియోగదారు స్నేహపూర్వక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టడం అవసరం’ అని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నొక్కి వక్కాణించింది. Read Also: కిందటి సంవత్సరంతో పోల్చితే ప్రజా సేవలను పొందడానికి దాదాపు ఐదుగురిలో ఒకరు (19 శాతం) లంచం చెల్లించడం.. దేశంలో ప్రభుత్వ అవినీతి ఒక పెద్ద సమస్య అని మూడొంతుల మంది అభిప్రాయపడ్డారని సర్వే గుర్తించింది. ఇది దేశ జనాభాలో సుమారు 836 మిలియన్ల ప్రజలకు సమానం. సర్వేలో పాల్గొనవారిలో దాదాపు 38 శాతం మంది గత పన్నెండు నెలల్లో దేశంలో అవినీతి పెరిగిందని, మరో 28 శాతం మంది అదే విధంగా ఉందని భావిస్తున్నారు. Read Also: నేపాల్, థాయ్‌లాండ్‌లో మెజారిటీ పౌరులు (వరుసగా 58%,55%) అవినీతి పెరిగిందని భావిస్తున్నారు. దీనికి విరుద్ధంగా చైనాలోని మెజారిటీ పౌరులు (64%), ఫిలిప్పీన్స్ (64 శాతం), కంబోడియా (55 శాతం) అవినీతి తగ్గినట్లు భావిస్తున్నారు నివేదిక ఉదహరించింది. లంచాల్లో భారత్ 39 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. తర్వాత కాంబోడియా (37 శాతం), ఇండోనేషియా (30 శాతం) ఉన్నాయి. అత్యల్పంగా మాల్దీవులు, జపాన్ (2శాతం), దక్షిణ కొరియా (10 శాతం), నేపాల్ (12 శాతం) నిలిచాయి.
By November 26, 2020 at 09:43AM
No comments