నాకు గతాన్ని గుర్తుచేశారు: ‘ఆకాశమే నీ హద్దురా’పై కెప్టెన్ గోపీనాథ్ ప్రశంసలు
సామాన్య ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకోవాలన్న లక్ష్యం కోసం పోరాడే యువకుడు.. ఆ మార్గంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు తెలియజేస్తూ తెరకెక్కించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ ఆటోబయోగ్రఫీ 'సింప్లి ఫ్లై' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సూర్య అద్భుతమైన నటన, దర్శకురాలు సుధా కొంగర టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే తన కథతో తెరకెక్కించిన సినిమాపై గోపీనాథ్ ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్న వేళ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారాయన.
అమెజాన్ ప్రైమ్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను చూసిన జీఆర్ గోపీనాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘గత రాత్రి ‘’ సినిమా చూశాను. సినిమా రోలర్ కోస్టర్‌లా అనిపించింది. ఫిక్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ నా పుసక్తంలోని ఎమోషన్స్‌ను చాలా బాగా క్యాప్చర్ చేశారు. నాకు నవ్వు రాలేదు.. ఏడుపు రాలేదు. కానీ గతం గుర్తుకొచ్చింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓ పారిశ్రామికవేత్తను ఎదిరించి సాధించిన విజయాన్ని కళ్లకు కట్టేలా చూపించారు. నా భార్య భార్గవి పాత్రను అపర్ణ చక్కగా చేసింది. తను స్వబుద్ధితో ఆలోచించే బలమైన మనస్తత్వం కలిగిన మృదుస్వభావి. గ్రామీణ మహిళలకు స్ఫూర్తినిచ్చే మనస్తత్వం కల వ్యక్తిగా చక్కగా చూపించారు. తన కలను నిజం చేసుకునే ఓ పిచ్చి, ప్యాషన్‌తో వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడనే చూపించే నా పాత్రను సూర్య అద్భుతంగా చేశారు. ఇక డైరెక్టర్ సుధా కొంగరకు హ్యాట్సాఫ్. సూర్య, అపర్ణ పాత్రలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు’ అని గోపీనాథ్ పేర్కొన్నారు. Also Read:By November 14, 2020 at 11:06AM
No comments