Breaking News

మూడో సారికీ రెడీ.. మళ్లీ గర్భం దాల్చాలని ఉంది.. అసలు విషయం చెబుతూ ఓపెన్‌ అయిన అనసూయ


జబర్దస్త్ లేడీ భరద్వాజ్ తన మనసులోకి మాటలను బయటపెట్టి ఆశ్చర్యపరిచింది. ఏ పేరెంట్ అయినా సరే.. ఇద్దరు పిల్లలుంటే చాలని భావిస్తున్న ఈ రోజుల్లో తనకు మూడో సంతానం కనాలని ఉందని పేర్కొంటూ ఓపెన్ అయింది అనసూయ. మూడోసారి గర్భం దాల్చడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, మళ్లీ తల్లి కావాలనుందని ఆమె చెప్పిన మాటలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. విషయం ఏదైనా కూడా మొహమాటం లేకుండా అసలు మ్యాటర్ చెప్పేయడం అనసూయకు అలవాటు. అదే ఆమెను చాలా సందర్భాల్లో ట్రోల్స్ బారిన పడేసింది. అయినా అనసూయతో ఆవగింజంత మార్పు కూడా కనిపించడం లేదు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా బయటపెట్టేస్తోంది. మరోవైపు విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా సత్తా చాటుతున్న ఈ జబర్దస్త్ భామ.. ప్రస్తుతం '' అనే మూవీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా అందులో గర్భవతిగా కనిపించి షాకిచ్చింది అనసూయ. Also Read: దీంతో అనసూయ మరోసారి గర్భవతి అయ్యిందంటూ సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. మాతృత్వంలో ఉన్న ఆనందం గొప్పదని, మరోసారి గర్భవతి అయి ఆ మాతృత్వపు ఆనందం పొందాలని ఉందని తెలుపుతూ ఓపెన్ అయింది. గతంలో తన ప్రెగెన్సీ సమయంలో పొందిన ఆ అనుభూతి మరోసారి పొందాలని ఉందని, అందుకే మళ్లీ తల్లి కావాలని అనుకుంటున్నా అంటూ అనసూయ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె.. మళ్లీ తల్లి అవుతా అని చెబుతుండటం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటున్నారు నెటిజన్లు.


By November 30, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anasuya-bharadwaj-open-comments-on-her-third-pregnancy/articleshow/79483956.cms

No comments