Breaking News

చెవిలో ఇయర్ ఫోన్స్‌ చంపేశాయ్.. వరంగల్‌లో యువకుడి దుర్మరణం


చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలు నడపడం.. రోడ్డుపై తిరగడం నేటి యువతకు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇయర్ ఫోన్స్‌ పెట్టుకుని మ్యూజిక్ వింటూ ప్రమాదాలను కూడా పట్టించుకోవడం లేదు. వెనక నుంచి వచ్చే వాహనాల హారన్లు వినపడక.. రైలు పట్టాలపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా మరోటి చోటుచేసుకుంది. ఇయర్ ‌ఫోన్స్‌ పెట్టుకుని రైలు పట్టాలు దాటుతున్న యువకుడు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వరంగల్‌లో జరిగింది. అర్బన్ జిల్లా పరిధిలోని చింతల్ చంద్రవదన కాలనీకి చెందిన అల్లూరి సునీల్(28) పెయింటింగ్ పనులకు వెళ్లేవాడు. పని ముగించుకుని ఇంటికి వస్తూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చింతల్ వద్ద రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. అదే సమయంలో వచ్చిన ఏడీఆర్‌ఎం స్పెషల్‌ రైలు సునీల్‌ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేమాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. Also Read:


By November 22, 2020 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-killed-on-railway-tracks-in-warangal/articleshow/79348557.cms

No comments