Breaking News

వెంటిలేటర్‌పైనే మాజీ ముఖ్యమంత్రి.. పరిస్థితి మరింత విషమం


అసోం మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం మరింత విషమించింది. ఇటీవల బారినపడి కోలుకున్న ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడటంతో నవంబరు 2 నుంచి గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ వెల్లడించారు. ‘శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.. దీంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌‌ను అమర్చారు’ అని మంత్రి తెలిపారు. ఆయన పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నారని, శరీరంలో చాలా అవయవాలు పనిచేయడంలేదని పేర్కొన్నారు. ‘ఔషధాలు, ఇతర చికిత్స ద్వారా అవయవాలు పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నారు.. ఆయనకు డయాలసిస్ కూడా నిర్వహించనున్నారు.. ఏది ఏమైనప్పటికీ వచ్చే 48-72 గంటల పాటు చాలా కీలకమని, సాధ్యమైన ప్రతి అంశాన్ని చేస్తామని’ అన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణుల నుంచి జీఎంసీహెచ్ వైద్యులు సూచనలు, సలహాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. మేము తరుచూ కుటుంబాన్ని సంప్రదించి, ప్రతి నిర్ణయం వారి సమ్మతితో మాత్రమే తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. మాజీ సీఎం తరుణ్ గొగొయ్‌కు అక్టోబరు 25న కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే, చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా.. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అసోం రాష్ట్రానికి తరుణ్ గొగొయ్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.


By November 22, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-assam-chief-minister-tarun-gogois-health-worsens-on-ventilator/articleshow/79348307.cms

No comments