వెనక్కి తగ్గిన వర్మ.. ‘మర్డర్’ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘’ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృతల ప్రేమపెళ్లి, ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్య కథాంశంతో నిర్మిస్తున్న ఈ సినిమాను నిలిపివేయాలంటూ అమృత నల్గొండ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాద ప్రతివాదనలు విన్న నల్గొండ కోర్టు ‘మర్డర్’ సినిమాపై స్టే విధించింది. దీంతో చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు నల్గొండ న్యాయస్థానం ఇచ్చిన స్టేను కొట్టివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే సినిమాలో అమృత, ప్రణయ్ పేర్లు ఎక్కడా వాడకూడదంటూ షరతు విధించింది. ఈ చిత్రంలో నిజజీవితాలను తలపించే విధంగా సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. Also Read: ఈ క్రమంలోనే ప్రణయ్, అమృత పేర్లను తాము ఎక్కడా వాడబోమని చిత్ర యూనిట్ తెలంగాణ హైకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో ‘మర్డర్’ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హైకోర్టు తీర్పు తమకు సంతోషం కలిగించిందని, వీలైనంత త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తామని యూనిట్ తెలిపింది. Also Read:
By November 06, 2020 at 12:15PM
No comments