చలిగా ఉందని నిప్పు రాజేస్తే.! చిత్తూరులో ఘోరం
చలిగా ఉందని వేడి కోసం రాజేసిన కుంపటి కొంపముంచింది. పొగ ఇంటిని కమ్మేసి నిద్రలోనే ఉసురుతీసింది. అక్కని చూడడానికొచ్చిన తమ్ముడిని బలి తీసుకుంది. ఈ అత్యంత విషాద ఘటన జిల్లాలో వెలుగుచూసింది. పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి గ్రామానికి చెందిన పురుషోత్తం, శైలజ భార్యాభర్తలు. వారికి కుమారుడు హరి ఉన్నాడు. దంపతులు అదే మండలంలోని నేలపల్లె సమీపంలో ఉన్న ఓ కోళ్లఫారంలో పనిచేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు. అక్కాబావలను చూసేందుకని శైలజ తమ్ముడు రెడ్డప్ప(11) వచ్చాడు. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉందని వేడి కోసం బొగ్గు కుంపటి రాజేసి పడుకున్నారు. చలి వస్తోందని ఇంటి తలుపులు, కిటికీలు బిగించేయడంతో పొగ కమ్మేసింది. నిద్రలోనే అందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుంపటి పక్కనే పడుకున్న రెడ్డప్ప ఊపిరాడక ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు. Also Read: ఉదయం ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన కోళ్లఫారం యజమాని స్థానికులతో కలసి తలుపులు బద్దలుకొట్టారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శైలజ, పురుషోత్తం, హరిలను 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. రెడ్డప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అక్కని చూసేందుకు వచ్చి తమ్ముడ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్రవిషాదం నింపింది. Read Also:
By November 29, 2020 at 11:55AM
No comments