బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

మరో బోరు బావి ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాలిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పాత బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పృథ్వీపూర్ ప్రాంతంలోని సేతుపురబారా గ్రామంలో మూడేళ్ల బాలిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ తెరచి ఉన్న పాత బోరుబావిలో పడిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. Read More: సంఘటన స్థలానికి సైన్యం చేరుకుందని, బాలికను బయటకు తీసేందుకు సహాయ చర్యలు ప్రారంభించామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్రతిభా త్రిపాఠి తెలిపారు. బోరుబావిలో పడిన బాలికను అధికారులు సురక్షితంగా బయటకు తీస్తారని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. సైనికులు బోరుబావి వద్ద సమాంతరంగా గుంత తవ్వి బాలికను తీసేందుకు యత్నిస్తున్నారు. బోరుబావి వద్ద సహాయపనులు చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు తమ బిడ్డ కోసం కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
By November 05, 2020 at 07:18AM
No comments