Breaking News

ఆధిక్యం దిశగా బైడెన్.. పెన్సుల్వేనియా, మిచిగన్ ఫలితాలపై కోర్టుకు ట్రంప్!


గతంలో ఎన్నడూ లేనివిధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఫలితాలపు ఉత్కంఠ నెలకుంది. ఇప్పటికే తాము విజయం సాధించేశామని ఇరువురు అభ్యర్థులు ప్రకటించుకోవడం విశేషం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. ఒక దశలో ఇరువురి మధ్య విజయం దోబూచులాడింది. అయితే డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ వెళ్లడంతో ఆయన తన ఆధిక్యాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా మిచిగన్‌(16)లో బైడెన్‌ విజయం సాధించడంతో ఆయన 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. మరో ఆరు ఓట్లు సాధిస్తే బైడెన్ వైట్‌హౌస్‌‌లో అడుగుపెట్టడం ఖాయం. కిందటిసారి మిచిగన్‌లో ట్రంప్ విజయం సాధించారు. ఇక, ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. ఇదిలా ఉండగా మిచిగన్‌ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్‌ కోర్టును ఆశ్రయించారు. ఓటింగ్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిపబ్లిక్‌ ప్రచార బృందం దావాలో ఆరోపించింది. విస్కోన్‌సిన్, మిచిగన్, పెన్సుల్వేనియాలో రీకౌంటింగ్ నిర్వహించాలని ట్రంప్ బృందం కోరింది. ఈ మూడు రాష్ట్రాలూ అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించేవి కావడంతో ట్రంప్ కోర్టులో దావా వేశారు. ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు వెళ్తామంటూ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ద రాష్ట్రమైన పెన్సిల్వేనియా, కీలక రాష్ట్రమైన నెవాడా సహా ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుండటంతో చివరికి విజయం ఎవరి వరిస్తోందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు, మిగతా అన్ని బ్యాలెట్లను అందజేయాలని యుఎస్ పోస్టల్ సర్వీసును న్యాయమూర్తి కోరినట్టు రాయిటర్స్ నివేదించింది. బ్యాలెట్లు ఎక్కడ ఉన్నాయి, డెలివరీ చేసిన తర్వాత లెక్కించవచ్చని యుఎస్ జిల్లా న్యాయమూర్తి ఎమ్మెట్ సుల్లివన్ వ్యాఖ్యానించినట్టు పేర్కొంది. దీనిపై పోస్టల్ సర్వీస్ విభాగం అధికారి కెవిన్ బ్రే సమాధానం ఇచ్చారని వివరించింది.


By November 05, 2020 at 06:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-poll-results-2020-trump-sues-in-pennsylvania-michigan-to-halt-vote-count/articleshow/79052527.cms

No comments