ప్రాణాల మీదకు తెచ్చిన పొలం రేటు.. విజయనగరంలో దారుణం
విజయనగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూమి ధరలకు అమాంతం రెక్కలు రావడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. మరొకరికి భూమిని అమ్మేందుకు ప్రయత్నించారని కత్తితో దాడి చేసిన అమానుష ఘటన జరిగింది. భోగాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూసపాటిరేగ మండలం కోనాడకి చెందిన రామగురువులు తన రెండెకరాల భూమిని విక్రయించేందుకు సమీప బంధువులైన అచ్చిబాబుతో ఒప్పందం చేసుకుంది. అందుకోసం అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే ఆ భూమి ధరలు అమాంతం పెరగడంతో విజయవాడకి చెందిన మరొకరికి విక్రయించేందుకు సిద్ధపడింది. తన కూతురు అరుణతో కలిసి భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న అచ్చిబాబు తన కొడుకులు ఉపేంద్ర, వెంకటేష్, మరొకరు అప్పలరెడ్డితో కలసి రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. తన వద్ద అడ్వాన్స్ తీసుకుని మరొకరికి భూమి ఎలా విక్రయిస్తారంటూ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. భూమి విక్రయిస్తామని అడ్వాన్స్ తీసుకుని మాట మార్చారన్న ఆగ్రహంతో అచ్చిబాబు కుమారుడు ఉపేంద్ర తన తమ్ముడు వెంకటేష్, స్నేహితుడు అప్పలరెడ్డితో కలసి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రామగురువులు కూతురు అరుణ, భూమి కొనుగోలుదారుల తరఫున వచ్చిన కాణిపాక గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్‌కి తీవ్రగాయాలయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దే జరగడంతో అలజడి రేగింది. కార్యాలయానికి వచ్చిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. Also Read: సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అరుణ, ప్రవీణ్ కుమార్‌ను హుటాహుటిన విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భూమి మొదట చెప్పిన ధర కంటే ఎక్కువ రేటు రావడంతో మరొకరికి విక్రయించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అయితే తమతో ఒప్పందం చేసుకున్నట్టు తక్కువ ధరకే భూమిని విక్రయించాలని ప్రత్యర్థి వర్గం పట్టుబట్టినట్లు తెలుస్తోంది. Read Also:
By November 14, 2020 at 12:17PM
No comments