బాలుడిని మింగేసిన బక్కెట్.. కామారెడ్డిలో విషాదం
బుడిబుడి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ సందడి చేస్తున్న బాలుడిని నీళ్ల బక్కెట్ మింగేసింది. అందులో పడిన బంతి తీసుకునేందుకు ప్రయత్నించి తల్లకిందులుగా పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన జిల్లా గాంధారి మండలంలో జరిగింది. నేరెల్‌తండాకి చెందిన జగదీష్, సీతాబాయి దంపతులకు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత కుమారుడు శ్రీగోపాల్ జన్మించాడు. చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులను ఊహించని విషాదం వెంటాడింది. ఆటలాడుకుంటూ చిన్నారి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీగోపాల్ బంతితో ఆడుకుంటుండగా నీళ్ల బక్కెట్లో పడిపోయింది. అందులో నుంచి బంతి తీసేందుకు ముందుకు వంగిన బాలుడు తల్లకిందులుగా అందులో పడిపోయాడు. బక్కెట్లో సగం వరకూ నీళ్లు ఉండడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో దారుణం జరిగిపోయింది. కొద్దిసేపటికి గమనించిన తల్లి చిన్నారిని బయటకు తీసేప్పటికే ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారాడు. నట్టింట చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు తీరని శోకంలో మునిగిపోయారు. Also Read:
By November 19, 2020 at 10:20AM
No comments