చిత్తూరు: స్నేహితులతో బయటికెళ్లి తిరిగిరాని భర్త.. తెల్లారేసరికి.!
స్నేహితులతో కలసి బయటికెళ్లిన భర్త రాత్రయినా తిరిగిరాలేదు. అప్పటికే కంగారుపడుతున్న కుటుంబ సభ్యులకి తోట సమీపంలో పడిపోయి ఉన్నాడని తెలియడంతో పరుగున వెళ్లారు. దుండగులు దారుణంగా కొట్టి పడేయడంతో అచేతనంగా పడి ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు చెప్పడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. అతన్ని అమానుషంగా కొట్టి చంపేసింది ఎవరు? అనే విషయం మిస్టరీగా మారింది. ఈ ఘటన జిల్లాలో జరిగింది. నియోజకవర్గ పరిధిలోని వి.కోట మండలం ఎస్.బండపల్లె పంచాయతీ అరిమాకులపల్లెకి చెందిన వెంకటేష్ కుమారుడు రమేష్(32) దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి సమయంలో స్నేహితులతో కలసి వెళ్లిన రమేష్ అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. తోట సమీపంలో రమేష్ గాయాలతో పడి ఉన్నాడని యువకుడు సమాచారం అందించడంతో భార్య లలిత, కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వెళ్లారు. Also Read: తీవ్రగాయాలతో అచేతనంగా పడి ఉన్న రమేష్‌ని వెంటనే వి.కోట ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి శరీరంపై గాయాలుండడంతో ఎవరో దారుణంగా కొట్టి చంపేశారని మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్నేహితులతో కలసి వెళ్లిన భర్త తెల్లారేసరికి శవంగా మారడంతో భార్య కన్నీరుమున్నీరైంది. ఎవరు హత్య చేసి ఉంటారనే విషయం మిస్టరీగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:
By November 13, 2020 at 10:56AM
No comments