వయసు వ్యత్యాసం పట్టించుకోం.. చిన్నవాళ్లతో రొమాన్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై నటించే జంటలపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. హీరో పక్కన హీరోయిన్ మరీ చిన్నపిల్లలా ఉందని కొంతమంది, హీరోయిన్ పక్కన హీరో తండ్రిలా కనిపిస్తున్నాడని కొందరు... ఇలా కాంబినేషన్లపై రకరకాలుగా చర్చించుకుంటూనే ఉంటారు. ఎప్పుడూ హీరో కంటే హీరోయిన్ వయసులో చిన్నదిగానే ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటుంటారు. ఒకటి, రెండు తరాల వెనక్కి వెళితే హీరో హీరోయిన్ల వయసు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ ఉండేది. ‘బడిపంతులు’ సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఈ తర్వాత ఆయన పక్కన హీరోయిన్‌గా నటించింది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఏకంగా 40ఏళ్లు ఉన్నా ప్రేక్షకులు మాత్రం ఆ జంటను ఆదరించారు.
ప్రస్తుత కాలంలో వెండితెర జంటల మధ్య వయసు వ్యత్యాసాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. హీరోలందరూ వయసులో దగ్గర దగ్గరగా ఉన్న హీరోయిన్లతో నటిస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే హీరోలు తమ కంటే పెద్ద వయసున్న హీరోయిన్లతో నటించేందుకు సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరు పూజా హెగ్డే. ఆమె వయసు 30 సంవత్సరాలు. పూజా నటిస్తున్న చిత్రాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఒకటి. అందులో హీరో అఖిల్ వయసు 26ఏళ్లే.. అంటే పూజా తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన హీరోతో నటిస్తోందన్నమాట. అయినప్పటికీ ఇటీవల విడుదలైన టీజర్‌లో ఈ జంట ముచ్చటగా అనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న కొన్ని సినిమాల్లో ‘వయసులో... హీరో కంటే హీరోయినే పెద్ద’ అనిపించే జంటలు ఉన్నాయి. నందు, రష్మీ గౌతమ్ నటిస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. నందుకి 32 ఏళ్లు. తన వయసు 38ఏళ్లని ఇటీవల ఓ షోలో రష్మీ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య ఏకంగా ఆరేళ్ల వ్యత్యాసం ఉంది. నాలుగు కథల సమాహారంగా తెరకెక్కుతున్న ‘గమనం’లో శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. వీరిలో హీరోకు 26, హీరోయిన్‌కి 28 ఏళ్లు. లాక్‌డౌన్‌లో ఓటీటీలో విడుదలైన కృష్ణ అండ్ హిజ్ లీల’లో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. కాలేజీలో హీరో సిద్ధూ జొన్నలగడ్డకి సీనియర్‌గా కనిపిస్తారు. తన జూనియర్‌తో లవ్‌లో పడిన అమ్మాయిగా నటించారు. రీల్ లైఫ్‌లోనే కాదు... రియల్ లైఫ్‌లోనూ హీరోకి ఆమె సీనియరే. సిద్ధూకి 28 అయితే... శ్రద్ధాకి 30 ఏళ్లు. మహేశ్, నమ్రత జంట చూడముచ్చటగా ఉంటుందని అందరూ అంటుంటారు. నిజ జీవితంలో ఒక్కటి కావడానికి ముందు వీళ్లిద్దరూ ‘వంశీ’ అనే సినిమాలో నటించారు. మహేష్ కంటే నమ్రతా మూడేళ్ల పెద్దది. ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ వయసు 35ఏళ్లు.. తన కంటే వయసులో ఎనిమిదేళ్లు చిన్నోడైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్(27)తో ‘కవచం’, ‘సీత’ చిత్రాల్లో కాజల్ అగర్వాల్ (33) జంటగా నటించింది. నాగచైతన్య (33) కూడా ఆమె కంటే వయసులో చిన్నోడే. వాళ్లిద్దరూ ‘దడ’లో కలిసి నటించారు. రానా దగ్గుబాటి (35), అనుష్క (39) మధ్య వయసులో నాలుగేళ్లు వ్యత్యాసముంది. వీళ్లిద్దరూ ‘రుద్రమదేవి’ జంటగా కనిపించారు. అలాగే తన కంటే వయసులో ఏడేళ్లు పెద్దదైన అమీషా పటేల్ (44)తో కలిసి ఎన్టీఆర్(37) ‘నరసింహుడు’. ‘సింహాద్రి’, ‘సాంబ’ చిత్రాల్లో హీరోయిన్ భూమిక (42) కూడా ఆయన కంటే వయసులో పెద్దదే. తనకంటే ఏడాది పెద్దదైన శ్రియతోనూ ఎన్టీఆర్ ‘నా అల్లుడు’ సినిమాలో నటించారు. ‘నువ్వా నేనా’లో ఓ హీరోగా నటించిన శర్వానంద్ శ్రియ కంటే రెండేళ్లు చిన్నోడు. ‘మహానటి’లో సమంతను ప్రేమించే యువకుడిగా విజయ్ దేవరకొండ నటించిన సంగతి తెలిసిందే. మంత కంటే విజయ్ దేవరకొండ రెండేళ్లు చిన్నోడు. ‘కుమారి 21ఎఫ్’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘అంధగాడు’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాల్లో జంటగా నటించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజ్ తరుణ్‌కి 28 ఏళ్లు కాగా, హెబ్బాకి 31. ఇలా టాలీవుడ్లో చాలా మంది హీరోలు తమకంటే వయసులో పెద్దవారైన హీరోయిన్లతో నటించి మెప్పించారు. Also Read: రెండేళ్ల క్రితం వచ్చిన ‘ఎఫ్2’లో మెప్పించిన వెంకటేష్, తమన్నా మధ్య ఏకంగా 29ఏళ్ల వ్యత్యాసముంది. అలాగే నందమూరి బాలకృష్ణ తాజా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సాయేషా సైగల్ వయసు 23ఏళ్లు. ఆమె కంటే బాలకృష్ణ(60) 37ఏళ్లు పెద్ద. ఇలా.. తమకంటే వయసులో చిన్న హీరోయిన్లతో హీరోలు నటిస్తున్నప్పుడు... తమకంటే వయసులో చిన్నవాళ్లైన హీరోలతో హీరోయిన్లు నటిస్తే తప్పేముంది?.. వెండితెరపై జంట ఎంత బాగా కనిపించదన్నదే ముఖ్యం గానీ.. వయసు వ్యత్యాసం ఎవరికి కావాలి.By November 21, 2020 at 10:56AM
No comments