గ్లామర్ డోస్ పెంచిన ‘లవ్‌లీ’ బ్యూటీ.. మాల్దీవుల్లో బికినీతో రచ్చ
బి.జయ దర్శకత్వంలో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కిన ‘’ సినిమా గుర్తుందా.. అందులో హీరోయిన్‌గా నటించిన శాన్వీ.. అమాయకపు చూపులతో, మత్తెక్కించే అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే.. వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో కన్నడ పరిశ్రమకు వెళ్లి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో ఈ అమ్మడికి అక్కడా ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. దీంతో గ్లామర్ షో చూపించి దర్శక నిర్మాతలను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. Also Read: ఇన్నాళ్లూ గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకున్న శాన్వీ.. ఇప్పుడు బికినీలో రెచ్చిపోతోంది. తాజాగా మాల్దీవులకి వెళ్లిన ఈ బ్యూటీ వైట్ బికినీలో సెగలు రేపు ఫోజులతో ఫోటోలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. శాండల్‌వుడ్ పట్టించుకోకపోవడంతో మళ్లీ తెలుగులో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న ఈ అమ్మడు.. ఈ గ్లామర్ డోస్‌తో తాను ఎక్స్‌పోజింగ్‌కు రెడీ అన్న సంకేతాలు ఇస్తోంది. మరి ఈ కష్టాన్ని సినీ మేకర్స్ గుర్తిస్తారో? లేదో? చూడాలి.
By November 24, 2020 at 07:56AM
No comments