Breaking News

సైన్యం అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది.. నగరోటా ఎన్‌కౌంటర్‌పై మోదీ ప్రశంసలు


సరైన సమయంలో సైన్యం అప్రమత్తతతో భారీ విధ్వంసం తప్పిందని, ఉగ్రవాదుల కుట్రను విజయవంతంగా భగ్నం చేయగలిగారని ప్రశంసించారు. జమ్మూ కశ్మీర్‌లోని నగరోటా వద్ద గురువారం నలుగురు జైష్‌ ఏ మొహమూద్ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన ఘటన, తదనంతర పరిణామాలపై ప్రధాని శుక్రవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ప్రధాని ట్విట్టర్‌లో ఈ అంశం గురించి ప్రస్తావించారు. కశ్మీర్‌ సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు, ఘటనలపై ప్రధాని చర్చించినట్లు తెలుస్తోంది. 26/11 ముంబయి దాడుల స్మృతి నేపథ్యంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. నగరోటాలో హతమైన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి లభించటం చూస్తే.. పెద్ద విధ్వంసానికే ప్రణాళిక వేసినట్లు తెలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ జైషే మొహమూద్ జమ్మూ కశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య విధ్వంసానికే వ్యూహ రచన చేసిందని మండిపడ్డారు. ప్రధాని నేరుగా జేషై ఉగ్రవాద సంస్థ పేరును ప్రస్తావించడం గమనార్హం. తమ సైన్యం మరోసారి ధైర్యసాహసాలను ప్రదర్శించిందని ప్రధాని కొనియాడారు. జమ్మూ కశ్మీర్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రమూకల చేసిన ప్రయత్నాన్ని అప్రమత్తతతో అడ్డుకోవడంతో పెను ముప్పు తప్పిందని సైన్యానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. నగరోటా ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. 11 ఏకే 47 రైఫిల్స్, 24 ఏకే మ్యాగిజైన్స్, మూడు పిస్టల్స్, మూడు మ్యాగిజైన్స్, 29 గ్రనేడ్లు, ఐదు రైఫిల్ గ్రనేడ్లు, డిటోనేటర్లు, 7.5 కిలోల ఆర్డీఎక్స్, 20 మీటర్ల ఐఈడీ వైర్ ఉగ్రవాదుల వద్ద లభించాయి. ప్రధాని నిర్వహించిన సమీక్షలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు అమర్చిన బాంబును భద్రతా బలగాలు గుర్తించి, తొలగించాయి. స్థానిక మసీదు సమీపంలోని ఒక పైపులో విద్రోహులు ఈ పేలుడు పదార్థాన్ని అమర్చారు. జమ్మూ కశ్మీర్‌లో స్థానిక ఎన్నికలను భగ్నం చేయడానికే పాక్ మూకలు ప్రయత్నిస్తున్నాయి.


By November 21, 2020 at 07:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-based-jaish-mohammed-terrorists-trying-to-target-jk-polls-says-pm/articleshow/79333288.cms

No comments