భార్య గొంతుకోసి దారుణం.. కడపలో కసాయి భర్త కిరాతకం
కట్టుకున్న భార్య గొంతుకోశాడో కసాయి భర్త. అనంతరం తాను కూడా గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన జిల్లాలో జరిగింది. పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయతీ పరిధిలోని వడ్డిపల్లెకి చెందిన శ్రీను(30), మంగమ్మ(24) భార్యాభర్తలు. సాయంత్రం వేళ మద్యం మత్తులో ఇంటికొచ్చిన శ్రీను భార్యతో గొడవపడి దారుణానికి తెగబడ్డాడు. కత్తితో కిరాతకంగా ఆమె గొంతుకోశాడు. అదే కత్తితో తాను గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతుండడంతో ఇరుగుపొరుగు కూడా గొడవ విషయం గమనించలేదు. ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్దిసేపటి అనంతరం గొంతు నుంచి రక్తం కారుతున్న మంగమ్మను స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్సుకు సమాచారఅం అందించారు. గ్రామానికి చేరుకున్న వైద్య సిబ్బంది భార్యాభర్తలను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. Also Read:
By November 26, 2020 at 12:23PM
No comments