Breaking News

అతడు దొరక్కపోతే జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోతా: త్రిష


దశాబ్ద కాలం పాటు తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా దుమ్మురేపింది బ్యూటీ . ప్రస్తుతం అడపాదడపా తమిళ సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడు త్రిషకు ఇప్పుడు 37ఏళ్లు. అయినప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా గడిపేస్తోంది. దీంతో ఆమె ఎక్కడికెళ్లినా పెళ్లెప్పుడు అన్న ప్రశ్న కామన్ అయిపోయింది. గతంలో చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని ప్రత్యేక విమానంలో విహారయాత్రకు కూడా వెళ్లొచ్చింది. అయితే ఏం జరిగిందో తెలీదు గానీ.. ఆ వివాహం క్యాన్సిల్ అయింది. అప్పటి నుంచి త్రిష మళ్లీ పెళ్లి ఊసెత్తడం లేదు. ఇటీవల నటుడు శింబుతో ఆమెలో ప్రేమలో ఉందని, త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై త్రిష స్పందిస్తూ... ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితేనే నా వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది. అప్పటివరకు సింగిల్‌గానే ఉంటా. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతా’ అని త్రిష స్పష్టం చేసింది. Also Read:


By November 17, 2020 at 11:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-trisha-openup-about-her-marriage-issue/articleshow/79256996.cms

No comments