జంటను కత్తిపీటతో నరికిన యువకుడు.. తూర్పుగోదావరిలో దారుణం
జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువజంటను సమీప బంధువు కత్తిపీటతో నరికేశాడు. భర్తకి తీవ్రగాయాలు కాగా.. అడ్డొచ్చిన భార్య కూడా ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన వై.రామవరం మండలం పియర్‌కొండలో జరిగింది. గ్రామానికి చెందిన జె.ధర్మారెడ్డి(25), అతని భార్య చంద్ర(22)పై అదే గ్రామానికి చెందిన ముర్ల రాజారావు పగ పెంచుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన రాజారావు కత్తిపీటతో ధర్మారెడ్డి మెడపై నరికాడు. అప్రమత్తమైన భార్య చంద్ర అడ్డురావడంతో ఆమెను కూడా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు భార్యాభర్తలను వెంటనే వై.రామవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ధర్మారెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్‌కి తరలించారు. దాడి చేసిన రాజారావు సమీప బంధువుగా తెలుస్తోంది. భార్య చంద్రకి సోదరుడు వరుస అవుతాడని సమాచారం. పాతకక్షల నేపధ్యంలోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By November 19, 2020 at 10:37AM
No comments