Breaking News

కొడుకు పెళ్లి శుభలేఖల కోసం ఒకరు.. భార్య ఆపరేషన్‌ కోసం మరొకరు.. నెల్లూరు ప్రమాదం హృదయ విదారకం


జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. చిల్లకూరు మండలం నాంచారమ్మపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. గూడూరు నుంచి చింతవరం బయలుదేరిన ఆటోని నాంచారమ్మపేట వద్ద ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మండలంలోని కలవకొండకు చెందిన కృష్ణయ్య(56), ఏరూరుకి చెందిన బుజ్జమ్మ(45), బల్లవోలు గ్రామానికి చెందిన భారతి(29) మృత్యువాతపడ్డారు. భార్యకి ఆపరేషన్ చేయిద్దామని ఒకరు. కొడుకు పెళ్లికి శుభలేఖల కోసం వచ్చి మరొకరు.. ఇలా పలు పనులపై గూడూరు వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. కలువకొండకు చెందిన కృష్ణయ్య తన భార్యకి ఆపరేషన్ చేయించడం కోసం గూడూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఆధార్ కార్డు అవసరం కావడంతో గ్రామానికి వెళ్లి తీసుకొచ్చేందుకు ఆటో ఎక్కాడు. భార్య ప్రాణాలు కాపాడడం కోసం బయలుదేరిన భర్త ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. Also Read: తన ఇంట్లో జరగబోతున్న శుభకార్యానికి ఏర్పాట్లలో భాగంగా టౌన్‌కి వచ్చిన బుజ్జమ్మ తిరిగివెళ్తూ ప్రాణాలు కోల్పోయింది. బుజ్జమ్మ కుమారుడి పెళ్లి నిశ్చయం కావడంతో శుభలేఖల కోసం బుజ్జమ్మ గూడూరు వచ్చింది. పెళ్లి శుభలేఖలు ముద్రణకు ఇచ్చి ఆమె తిరిగి వెళ్తూ ఆటో ఎక్కి ప్రమాదానికి గురైంది. పరామర్శ కోసం ఆస్పత్రికి వచ్చిన భారతి.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయింది. తన బావ కూతురు ప్రసవించడంతో చూసేందుకు భారతి వెళ్లింది. ఆమెను పరామర్శించి గ్రామానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. నాంచారమ్మ పేట వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. Read Also:


By November 12, 2020 at 12:21PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-killed-in-road-accident-in-nellore/articleshow/79186279.cms

No comments