కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
కోవిడ్-19 బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ శివానంద ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఐసీయూలో మంటలు చెలరేగడంతో అందులో చికిత్స పొందుతున్నవారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయానికి ఐసీయూ 11 మంది రోగులున్నారు. వీరిలో ఆరుగురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ హాస్పిటల్‌లో మొత్తం 33 మంది కోవిడ్-19 బాధితులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్‌షర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణలో వెల్లడవుతుందని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు వివరించారు. ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపడతామని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఆస్పత్రి తీసుకున్న చర్యలపై అనుమానం వ్యక్తమవుతోంది. దర్యాప్తులో వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. ఆగస్టులోనూ అహ్మదాబాద్ చోటుచేసుకుని 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయ తెలిసిందే. నవరంగ్‌పురలోని శ్రేయ ఆస్పత్రిలో వ్యర్థాలకు నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. దీంతో ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న 8 మంది చనిపోయారు.
By November 27, 2020 at 06:54AM
No comments