కారులో వచ్చి యువతి కిడ్నాప్.. అనంతపురంలో కలకలం

అనంతపురంలో యువతి ఘటన కలకలం రేపింది. నగరంలోని ఆజాద్ నగర్‌కి చెందిన యువతి(22) అపహరణకు గురైంది. కారులో వచ్చిన దుండగులు యువతిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆజాద్ నగర్ ఆరో రోడ్డుకి చెందిన కార్పెంటర్ కూతురు(22)కి కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన యువకుడితో గతంలో వివాహం నిశ్చయించారు. అతను అవుకు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇరుకుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వివాహం రద్దు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం యువతి మరో మహిళతో కలసి టైలర్ వద్దకు బయలుదేరింది. ఆ సమయంలో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. యువతి ఆచూకీ కనుగొనేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యులు చేపట్టాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా కారును గుర్తించి సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. Also Read:
By November 03, 2020 at 12:18PM
No comments