ప్రేమలో పడిన ‘చిన్నారి పెళ్లికూతురు’.. బీచ్‌లో ప్రియుడితో అలా...


‘చిన్నారి పెళ్లికూతురు’గా అందరినీ ఆకట్టుకుని ఆ తర్వాత హీరోయిన్‌‌గా మారింది . తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తోనే మంచి గుర్తింపు సాధించి ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బరువు పెరగడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొంతకాలం బ్రేక్ తీసుకుని ‘రాజుగారి గది 3’తో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది అవికాగోర్. తన మనసుని దోచుకున్న ప్రియుడిని సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసింది. అయితే పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం లేదని, ప్రేమ జీవితం ఒక అందమైన అనుభవంలా ఉందంటూ చెప్పుకొస్తూ ప్రియుడితో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆమె ప్రియుడి పేరు మిలింద్ చద్వానీ. ‘నా ప్రార్థనలకి సమాధానం దొరికింది. నాకు నిజమైన ప్రేమ దొరికింది. మనకు నచ్చిన లక్షణాలున్న వ్యక్తి దొరకడం కష్టమని అనుకుంటాం గానీ నాకు మాత్రం అలాంటి వ్యక్తే దొరికాడు. ఇదంతా ఒక కలలా ఉంది. నేను ఎలాంటి భావనకి గురవుతున్నానో అందరూ అదే అనుభూతిని పొందాలని ఆశిస్తున్నా. ఈ బంధం నా జీవితంలో కీలక పాత్ర పోషించబోతోంది’.. అంటూ అవికా తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసుకుంది. Also Read:


By November 12, 2020 at 08:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-avika-gor-has-found-the-love-of-her-life-she-is-dating-with-milind-chandwani/articleshow/79182715.cms

No comments