మళ్లీ ఆ రోజులు రావాలంటూ కన్నీరు పెట్టుకున్న పూరి జగన్నాథ్.. చొక్కాలు చిరగాలంటూ!!
మహమ్మారి కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. దేశవ్యాప్తంగా కోరలు చాచి అన్ని రంగాలను కకావికలం చేయడమే గాక అన్ని రంగాల్లోని కార్మికుల వెన్నువిరిచింది. కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని నెలలపాటు లాక్‌డౌన్ విధించడంతో చేతిలో పని, జేబులో డబ్బు లేక విలవిల్లాడిపోయాయి కార్మిక వర్గాలు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. షూటింగ్ బంద్ కావడం, థియేటర్ల గేట్లకు తాళాలు పడటంతో సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాతరోజులు రావాలి, థియేటర్స్ ఈలలతో దద్దరిల్లిపోవాలని కోరుకుంటూ ఎమోషనల్ అయ్యారు . మరోవైపు లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ ప్రారంభమవుతున్నాయి. మూతపడిన థియేటర్స్‌ను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి అంగీకారం వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమా హాల్స్‌కి రావడానికి జంకి పోతున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులను తిరిగి సినిమా హాళ్లకు రమ్మని ఆహ్వానిస్తూ ‘’ పేరుతో కన్నడ చిత్రపరిశ్రమ ఓ వీడియో రూపొందించింది. Also Read: సినిమా థియేటర్స్ పూర్వ వైభవం సంతరించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో సినీ పరిశ్రమలో ఉన్నవారికి థియేటర్లు దేవాలయాలతో సమానమని, ప్రేక్షకులే దేవుళ్ళని.. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ తెలిపారు. కాగా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న పూరీ జగన్నాథ్.. ''ఈ వీడియో చూశాక నాకు కన్నీళ్లు వచ్చాయి. మళ్లీ ఆరోజులు రావాలి. విజిల్స్ వెయ్యాలి. పేపర్స్ ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా థియేటర్.. మన అమ్మ'' అని పేర్కొంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. a
By November 17, 2020 at 09:38AM
No comments