జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. ‘ఆమె’దే ఆధిపత్యం!
ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలకు స్థానాలు దక్కాయి. మేయర్ పీఠం జనరల్ మహిళకు దక్కగా.. సగం సీట్లలో అతివలే పోటీ చేయనున్నారు. ఎస్టీలకు రిజర్వ్ అయిన వార్డుల్లో ఒకటి మహిళకు కేటాయించగా.. మరొకటి జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ రిజర్వ్‌డ్ వార్డుల్లో ఐదు మహిళలకు కేటాయించారు. బీసీ వార్డుల్లో 25 మహిళలకు, 25 జనరల్‌కు కేటాయించారు. రిజర్వేషన్లు లేని జనరల్ సీట్లలో 44 వార్డులను మహిళలకు కేటాయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243టీ ప్రకారం స్థానిక ప్రభుత్వాల్లో (లోకల్ బాడీస్) మహిళలకు కనీసం మూడొంతుల రిజర్వేషన్ కల్పించాలి. దీంతో అన్ని లోకల్ బాడీస్‌లో మహిళలకు సగం సీట్లు కేటాయించేలా చూడాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. దీంతో గత నెలలో (అక్టోబర్ 13న) సమావేశమైన అసెంబ్లీ జీహెచ్ఎంసీ (సవరణ) బిల్లు, 2020కి ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. 2015లో ప్రభుత్వం జీవో జారీ చేసిందని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం బీసీలకు 33.3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
By November 18, 2020 at 09:19AM
No comments