Breaking News

నాలుగు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా వ్యాక్సినేషన్‌.. ఫైజర్ ప్రకటన


అమెరికా ఫార్మ సంస్థ ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు మధ్యంతర నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించినున్నట్టు సోమవారం ఫైజర్ ప్రకటించింది. టీకా డెలివరీ, విస్తరణ ప్రణాళికను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుందని పేర్కొంది. రోడ్ ఐల్యాండ్, టెక్సాస్, న్యూ మెక్సికో, టెన్నెస్సీ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద వ్యాక్సినేషన్ ప్రారంభించినట్టు తెలిపింది. వ్యాక్సిన్ పరిమాణంలో తేడాలు, రోగనిరోధకత, జనాభా వైవిధ్యం కారణంగా ఈ నాలుగు రాష్ట్రాలను పైలజ్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకున్నట్టు వివరించింది. మౌలిక సదుపాయాలు, అలాగే వివిధ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని వ్యక్తులకు చేరుకోవడానికి రాష్ట్రాల అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ‘ఈ పైలట్ ప్రాజెక్టులో చేర్చిన నాలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందే వ్యాక్సిన్ డోస్‌లు పొందవు లేదా వాటికి ఎటువంటి మినహాయింపు ఉండదు’ అని ఫైజర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ సవాళ్లతో కూడుకున్నదని, దీనిని నిల్వ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, వ్యాక్సిన్ తయారీలో ఫైజర్, మోడెర్నా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడ్డాయి.. ‘మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ’ అని పిలిచే అణువుల సింథటిక్ వెర్షన్‌లను మానవ కణాలలో చొప్పించి, వాటిని టీకా తయారీకి ఫ్యాక్టరీగా మారుస్తారు. ఫైజర్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తే, మోడెర్నా వ్యాక్సిన్‌ (ఎంఆర్‌ఎన్‌ఏ-1273)94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని సోమవారం ప్రకటించింది. అటు రష్యా కూడా తమ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ 92 శాతం మేర ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.


By November 17, 2020 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pfizer-to-start-covid-19-immunization-pilot-program-in-four-states-in-us/articleshow/79255845.cms

No comments