Breaking News

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. దారుణం


మహిళ బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా వీడియో తీసిన పోకిరీ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆమెతో శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తుపాకీ గురిపెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు దారుణాన్ని భర్తకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు. అయితే అక్కడా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయస్థానం తలుపుతట్టారు. చివరికి కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. కాన్పూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ అత్తమామలతో కలసి నివసిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం ఢిల్లీలో ఉంటున్నాడు. ఆమె ఇంటికి సమీపంలో నివాసముంటున్న యువకుడు రోహిత్ అలియాస్ బాబు ఆమెపై కన్నేశాడు. ఆమె బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలో పైనుంచి వీడియో తీశాడు. రాత్రివేళ ఆమె ఇంట్లోకి చొరబడి వీడియోతో బ్లాక్‌మెయిల్ చేశాడు. తన కోరిక తీర్చకుంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అయినా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తుపాకీ తలకి గురిపెట్టి దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను అమానుషంగా అత్యాచారం చేశాడు. బాధితురాలు విషయం తన భర్తకి చెప్పడంతో ఆయన ఢిల్లీ నుంచి గ్రామానికి వచ్చాడు. బాధితురాలితో కలసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడ పరాభవం ఎదురైంది. పోలీసులు పట్టించుకోకపోవడంతో దంపతులు కోర్టుని ఆశ్రయించారు. చివరికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Also Read:


By November 21, 2020 at 01:00PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-films-woman-in-bathroom-blackmails-for-extramarital-affair-in-kanpur/articleshow/79336852.cms

No comments