జాకెట్ వేసుకోకుండా నటిస్తే బోల్డ్ పాత్ర అయిపోదు: అర్చన షాకింగ్ కామెంట్
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల టైమ్ చాలా తక్కువ ఉంటుంది. హీరోల్లా దశాబ్దాలుగా వారిని చూసేందుకు ప్రేక్షకులు సైతం ఇష్టపడరు. అందుకే చాలామంది హీరోయిన్ ఛాన్సులు తగ్గిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతుంటారు. మరికొందరేమో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సెటిలైపోతుంటారు. అయితే కేవలం గ్లామర్ షో చేసిన వాళ్లు మాత్రమే హీరోయిన్‌గా రాణిస్తారన్న చెడు అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి దూరమైనా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు. తొలి సినిమా ‘’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘లేడీ టైలర్’తో మరింత క్రేజ్ దక్కించుకున్నారు. ఆ వెంటనే వెండితెరకు దూరమైనా ప్రేక్షకులు మాత్రం ఆమెను మరిచిపోలేదు.
సుమారు 25ఏళ్ల తర్వాత ‘అలీతో సరదాగా’ అనే షో ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు అర్చన. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారామె. మహేంద్ర దర్శకత్వంలో భానుచందర్ హీరోగా తెరకెక్కిన ‘నిరీక్షణ’లో అర్చన హీరోయిన్. గిరిజన యువతి పాత్రలో నటించిన అర్చన.. సినిమా అంతా జాకెట్ వేసుకోకుండా నటించడం అప్పట్లో సంచలనంగా మారింది. Also Read: ఆ పాత్రపై తాజాగా స్పందించిన అర్చన..ఆ చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకే జాకెట్ లేకుండా నటించినట్టు చెప్పుకొచ్చారు. గిరిజన మహిళ పాత్రలో నటించడం వలన జాకెట్ లేకుండా నటించాల్సి వచ్చిందని... అలా అని దాన్ని బోల్డ్ పాత్ర అని చెప్పలేమన్నారు. ఏది ఏమైనా ఆ పాత్ర తనకు మంచిపేరు తెచ్చిపెట్టిందని అర్చన తెలిపారు. Also Read:By November 18, 2020 at 09:59AM
No comments