Breaking News

‘వాళ్లకి నడుము చూపిస్తే చాలు’.. దుమారం రేపుతున్న పూజా హెగ్డే వ్యాఖ్యలు


కన్నడ భామ అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాలు చేస్తూ మరికొన్నింటిని లైన్లో పెట్టింది. అయితే తాజాగా ఆమె టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపేలా కనిపిసిస్తున్నాయి. సౌత్ సినిమా వాళ్లకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని, వాళ్లను ఎప్పుడూ మిడ్ డ్రెస్‌ల్లోనే చూడాలనుకుంటారంటూ వ్యాఖ్యానించింది. Also Read: పూజా వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో దుమారం రేపుతున్నాయి. నీకు బ్రతుకునిచ్చిన దక్షిణాది ఇండస్ట్రీపైనే నీచపు కామెంట్లు ఎలా చేస్తావంటూ నెటిజన్లు ఆమెను నిలదీస్తున్నారు. నీకు చేతనైతే ఎక్స్‌పోజింగ్ మానేసి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకోవాలంటూ హితవు పలుకున్నారు. తెలుగు ఆడియన్స్‌ నీకు స్టార్‌ హీరోయిన్‌ హోదా ఇచ్చినందుకు తగిన గుణపాఠం చెప్పావని, వీలైతే టాలీవుడ్‌ని వదిలి వెళ్లిపో అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. Also Read: నీకు పేరు, హోదా ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీని కించపరిచే బదులు.. బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ సెటిలవ్వు అంటూ కొందరు పూజాను విమర్శిస్తున్నారు. హిందీలో మాత్రం నువ్వేమైనా సాంప్రదాయ పాత్రలు చేస్తున్నావా?.. ఇక్కడి కంటే ఘోరంగా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావంటూ మండిపడుతున్నారు. తనపై వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై పూజా ఇంకా స్పందించలేదు. కాగా, గతంలో కూడా గతంలో తాప్సీ కూడా ఇండస్ట్రీపై ఇలాంటి కామెంట్స్‌ చేసిన సంగతి విదితమే.


By November 07, 2020 at 08:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-pooja-hegde-sensational-comments-on-south-film-industry/articleshow/79092976.cms

No comments