Breaking News

‘విచిత్ర సోదరులు’లో కమల్ హాసన్ మరుగుజ్జుగా ఎలా కనిపించారో తెలుసా?


సుప్రసిద్ధ దర్శకుడు చేసిన సినిమాలన్నీ ఎక్కువగా ప్రయోగాలతో కూడినవే ఉంటాయి. పుష్కక విమానం, ఆదిత్య 369, , భైరవద్వీపం లాంటి సినిమాలు ఆయనలోని టాలెంట్‌ను గుర్తుచేస్తుంటాయి. ముఖ్యంగా కమల్‌ హాసన్ డ్యుయెర్‌ రోల్‌లో నటించిన ‘విచిత్ర సోదరులు’ సినిమా అయితే ఇప్పటికీ ఓ షాకింగ్‌గా అనిపిస్తుంది. టెక్నాలజీ అంతగా లేని టైమ్‌లోనే కమల్‌ను పొట్టివాడిగా ఆయన చూపించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. Also Read: ‘అమావాస్య చంద్రుడు’ సినిమా తర్వాత కమలహాసన్, సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేషన్లో మరొక సినిమా చేద్దామనుకుని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ ఒక స్టోరీ లైన్ చెప్పగా దానిపై సింగీతం శ్రీనివాసరావు కథ రాసుకున్నారు. ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు కమలహాసన్ తీసుకున్నారు. అలా తమిళంలో తెరకెక్కిన ‘సహోదరగల్’ సినిమాను తెలుగులో ‘విచిత్ర సోదరులు’గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా హిందీలో ‘అప్పు రాజా’ పేరుతో విడుదల చేశారు. 1989లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇందులో కమల్.. సేతుపతి, అప్పు, రాజాగా త్రిపాత్రాభినయం చేశాడు. ఇందులో అప్పు అనే మరుగుజ్జు పాత్రలో కమల్ పరకాయ ప్రవేశం చేశారనే చెప్పొచ్చు. గ్రాఫిక్స్ లేని సమయంలో కమల్ హాసన్ ఆ పాత్రలో ఎలా ఒదిగిపోయారన్నది ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆ విశేషాలను సింగీతం శ్రీనివాసరావు ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరుగుజ్జు పాత్రలో కాకుండా ఇతర పాత్రలో కమల్ హాసన్ కనిపించినప్పుడు సాధారణంగా క్లోజప్ లేదా లాంగ్ షాట్స్ తీసేవారు. మరుగుజ్జు పాత్ర వచ్చేసరికి ఆయన కాళ్లను వెనుకకు మడిచి 18 అంగుళాల షూస్ ప్రత్యేకంగా తయారు చేయించి తోడిగేవారు. ఈ సినిమాలో ‘బుజ్జి పెళ్ళికొడుక్కి రాజయోగమురా’ అనే పాటలో ప్రత్యేకంగా ఒక సోఫాను తయారు చేయించారు. కమల్ హాసన్‌ని నడుము వరకు అందులో దించి అతని ముందు కృత్రిమ కాళ్లను అమర్చి వాటికి రెండు వైర్లు అమర్చి, కాళ్లు ఊగేలా.. జపాన్ కు చెందిన సెట్ బాయ్ సహకారంతో షూటింగ్ చేశామని సింగీతం చెప్పారు. అయితే మానిటర్ లేని సమయంలో, టేక్స్ తీసుకోకుండా కమల్ హాసన్ నటించిన తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన తెలిపారు. Also Read:


By November 07, 2020 at 12:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shocking-secret-about-kamal-character-in-vichitra-sodarulu-movie/articleshow/79095607.cms

No comments